రిలీజ్ కు ముందే రికార్డ్ సృష్టించబోతోన్న బాలయ్య సినిమా

నందమూరి బాలకృష్ణ అంటే రికార్డుల రారాజు. ఒకప్పుడు ఎన్నో సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. ఇప్పటికీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అఖండ, వీర నరసింహారెడ్డి అంటూ బ్యాట్ టు బ్యాక్ హిట్స తో జోష్ గా ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఇది బాలయ్యతో పాటు అనిల్ ఇమేజ్ కూ తగ్గట్టుగా ఉండే యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది. బాలకృష్ణ సరసన ఫస్ట్ టైమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పెళ్లై, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ చేస్తోన్న సినిమా ఇది. అంటే తనకు ఇది రీ ఎంట్రీ అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తోంది. కొన్నాళ్లుగా వినిపిస్తోన్న రూమర్స్ ను బట్టి శ్రీ లీల .. బాలయ్య కూతురుగా కనిపిస్తుందని టాక్.

మొత్తంగా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇక ఈ నెల 10న బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను వినూత్నంగా విడుదల చేయబోతోంది టీమ్.