సలార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా సలార్. ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అంతకు ముందే అసలు రిలీజ్ కు ముందు చేసే హడావిడీ ఏం కనిపించలేదు. దీంతో ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అదే పనిగా ఆరాలు తీశారు. అయినా మూవీ టీమ్ స్పందించలేదు. ఎప్పుడైతే సెప్టెంబర్ 28న సడెన్ గా చిన్న సినిమాలు రిలీజ్ డేట్ వేశాయో అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఫైనల్ గా మూవీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. సలార్ లో కొన్ని సీన్స్ లో సీజీ వర్క్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగా రాలేదట. వాటిని మళ్లీ చేసేందుకే ఈ గ్యాప్ తీసుకున్నారు అనేది మూవీ టీమ్ చెప్పిన మాట.

ఇక మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే దానికి మూవీ టీమ్ నుంచి అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ యేడాదే విడుదల చేస్తాం అనే గ్యారెంటీ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చి ఉన్నారు. అంటే ఎట్టి పరిస్థితిలోనూ 2024కు వెళ్లం అనే హామీ అన్నమాట. దీన్ని బట్టి ఈ యేడాది నవంబర్ లేదా డిసెంబర్ లోనే వస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఇదే అంటూ కొత్త డేట్ ఒకటి వినిపిస్తోంది. నవంబర్ 2.. ఇదే సలార్ కొత్త రిలీజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమా కాదా అనేది మూవీ టీమ్ చెబితే కానీ తెలియదు. బట్ ఇప్పటికైతే ఈ చిత్రం నవంబర్ 2న ఖచ్చితంగా విడదలవుతుందంటున్నారు.


ఇక సలార్ లో ప్రభాస్ కు పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. పాటు శ్రుతి హాసన్, మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్స్. ప్రకాష్‌ రాజ్, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి ఇతర కీలక పాత్రలు చేస్తోన్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం చేస్తున్నాడు. హొంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.

Related Posts