సంయుక్త మీనన్.. సమ్ థింగ్ స్పెషల్. మళ్లీ హిట్ కొట్టింది..

కొందరు హీరోయిన్లకు టైమ్ అలా కలిసొస్తుందంతే. చేసిన సినిమాలన్నీ హిట్ అవుతాయి. అందరికీ ఇది సాధ్యం కాదు. కొందరికే చెల్లుతుంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ టైమ్ నడుస్తోంది. నిజానికి అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సినిమాను బట్టి చూస్తే అసలు తర్వాత హీరోయిన్ గా ఆఫర్స్ వస్తాయా అనుకున్నారు చాలామంది. బట్.. భీమ్లా నాయక్ తో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా బింబిసార, సార్ మూవీస్ తో సూపర్ హిట్స్ చూసింది. కాకపోతే ఆ చిత్రాల్లో తన పాత్ర పరిమితంగానే కనిపిస్తుంది. బట్ లేటెస్ట్ గా వచ్చిన విరూపాక్షలో నట విశ్వరూపం చూపించింది. తనే సినిమాకు హైలెట్ అంటే అతిశయోక్తి కాదు. అందంతోనే కాదు.. నటనతోనూ అదరగొట్టింది. నందిని అనే అమ్మాయి పాత్రలో తను జీవించింది. అంతే కాదు.. ఆ పాత్రలోని వేరియేషన్స్ ను కూడా అద్భుతంగా పలికించింది.

ఇప్పటికే తనను గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాలకు మించి ఈ మూవీ క్రిటిక్స్ నుంచి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. అన్ని రివ్యూస్ లోనూ తనే హైలెట్ గా ఉంది. సో.. సంయుక్తకు ఇక పెద్ద హీరోలు కూడా అవకాశాలిచ్చే ఛాన్స్ ఉంది. అలాగే తర్వాత రాబోతోన్న కళ్యాణ్ రామ్ మూవీ డెవిల్ కు సంయుక్త ఖచ్చితంగా మరింత ప్లస్ అవుతుంది

ఇక విశేషం ఏంటంటే.. సంయుక్త మీనన్ సంతకం చేసి ఫస్ట్ తెలుగు సినిమా విరూపాక్షనే. బట్ సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ కావడం.. అంతకు ముందే కరోనా రావడం వంటి కారణాలతో ఈ మూవీ లేట్ అయింది. దీని తర్వాత ఒప్పుకున్న భీమ్లా నాయక్, బింబిసార, సార్ మూవీస్ సూపర్ హిట్స్ గా నిలవడంతో ఈ మూవీకి అదనంగానూ కలిసొచ్చింది. ఏదేమైనా ఇప్పుడు సంయుక్త మీనన్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. మరి ఈ ఊపులో మరిన్ని సినిమాలు వస్తాయని వేరే చెప్పక్కర్లేదేమో.

Related Posts