విజయ్ దేవరకొండ విజయం సాధించాలి

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించారు. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన కథగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు చెబుతున్నాడు.

గీత గోవిందం అర్జున్ రెడ్డి వరకూ అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయంటున్నారు. ఇక ఈ చిత్రం విజయ్ దేవరకొండకు అత్యంత కీలకంగా మారింది. కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు విజయ్. ఆ ఫ్లాప్ లకు ఖుషీ అడ్డు కట్ట వేసేలానే ఉంది. ఎలా చూసినా విజయ్ టాలీవుడ్ లో టాలెంటెడ్ అండ్ ప్రామిసిగ్ స్టార్. ఆ స్టార్డమ్ కు తోడు విజయాలు పడితే మరో లీగ్ లోకి ఎంటర్ అవుతాడు.

ఆ విజయాన్ని ఈ ఖుషీ ఇస్తుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. అటు విజయ్ తో పాటు దర్శకుడు, నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే అవుట్ పుట్ పై వారికి అంత నమ్మకం ఉందని అర్థం.


ఇక సమంత విషయంలో కంటే విజయ్ కే ఈ మూవీ విజయం అవసరం. సమంత కెరీర్ దాదాపు చివరికి వచ్చినట్టే. ఇంకా హీరోయిన్ గా చేసే అవకాశాలు లేవు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కష్టం అని గత చిత్రాలైన యశోద, శాకుంతలం నిరూపించాయి.

సో.. ఆమెకు ఈ మూవీ రిజల్ట్ తో పెద్దగా పనిలేదు. బట్ విజయ్ కి అవసరం. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే పరశురామ్, గౌతమ్ తిన్ననూరితో చేస్తోన్న అతని నెక్ట్స్ మూవీస్ కు మరింత హైప్ వస్తుంది.

Related Posts