లియో పై అనుమానాలు లేనట్టే

దసరా బరిలో రేపు తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి‘ వస్తుంటే.. తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘లియో‘. పేరుకు డబ్బింగ్ సినిమాయే అయినా హీరో విజయ్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ల క్రేజ్ తో ఈ సినిమాకి తెలుగు సర్కిల్స్ లో భారీ క్రేజ్ నెలకొంది. అలాగే.. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ తెలుగు నాట డబ్బింగ్ సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లలో ‘లియో‘ కొత్త రికార్డులు సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది.

‘లియో‘ టైటిల్ తెలుగులో ఆల్రెడీ వేరొకరు రిజిష్టర్ చేయించుకోవడంతో ఈ సినిమా విడుదలను ఈనెల 20 వరకూ ఆపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే.. కోర్టు బయటే ఈ వివాదాన్ని తాము పరిష్కరిస్తామని.. ‘లియో‘ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తుందని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ స్పష్టం చేశారు.

మరోవైపు ‘మాస్టర్‘ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తోన్న ‘లియో‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిందట. అయితే.. ఈ బడ్జెట్ లో సగభాగం రెమ్యునరేషన్సే ఉన్నాయట. ఈ సినిమాకి హీరో విజయ్ రూ.120 కోట్లు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూ.10 కోట్లు, సంజయ్ దత్ రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద.. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన ‘లియో‘ థియేట్రికల్ గానూ పలు భాషల్లో వందల కోట్లు కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Related Posts