మెగాఫోన్ పట్టుకున్న నటీమణి

వెండితెరపై వెలుగులు విరజిమ్మే కథానాయికలు తెరవెనుక మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన సందర్భాలు ఎన్నో. భానుమతి, సావిత్రి, విజయ నిర్మల వంటి వారు దర్శకులుగానూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక.. ఈమధ్య కూడా లేడీ డైరెక్టర్స్ ట్రెండ్ జోరుగానే సాగుతోంది. లేటెస్ట్ గా ఓ యంగ్ ఏక్ట్రెస్ మెగాఫోన్ పట్టుకుంది. ఆమె పేరు సంజన అన్నే.

పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే తాజాగా దర్శకత్వ భాధ్యతలు చేపట్టింది. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే నిర్వహిస్తుంది.

Related Posts