మిస్ శెట్టి మిస్టర్ శెట్టిపై చిరంజీవి రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు చూసి వాటి గురించి ముందే చెప్పేస్తుంటారు. ఆయన చెప్పిన సినిమాలు మాగ్జిమం విజయాలు సాధించాయి. తాజాగా ఆయన మిస్ శెట్టి మిస్టర్ శెట్టి చిత్రాన్ని చూశారు. వెంటనే తన రివ్యూను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇది జాతిరత్నాలును మించే హిట్ అవుతుంది. మరి మెగాస్టార్ అచ్చంగా ఏం అన్నాడో చూద్దాం.


”మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babu ని అభినందించాల్సిందే.


BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!!😇🤣😂.. ” అంటూ హ్యాపీ ఇమోజీలు యాడ్ చేశారు చిరంజీవి.


సో.. లేట్ గా వస్తున్నా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అప్పుడే అనిపిస్తోంది. నిజానికి ఈ కాంబినేషన్ పై మంచి క్రేజ్ ఉంది. దానికి మెగా రివ్యూ తో అంచనాలు డబుల్ అవుతున్నాయి. మరి ఈ నెల 7న విడుదల కాబోతోన్న మిస్ శెట్టి మిస్టర్ శెట్టికి మెగాస్టార్ రివ్యూ నిజమైతే యూవీ క్రియేషన్స్ కు బ్లాక్ బస్టర్ పడినట్టే.

Related Posts