మా ఊరి రాజారెడ్డి ట్రైలర్‌ గ్రాండ్‌ లాంచ్

మా ఊరి రాజారెడ్డి.. స్వర్గీయ రాజారెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉండే సినిమా అన్నారు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి.. రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ చిత్రంలో నిహాన్‌ , వైష్ణవి కాంబ్లే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ గ్రాండ్ గా జరిగింది. మార్చి1 న సినిమా గ్రాండ్ గా రిలీజ్‌ చేయబోతున్నారు.


రాజారెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ.. తెలుగు సినిమాలు ప్రపంచస్థాయికి ఎదగడానికి హైదరాబాద్ ముఖ్య ప్రాంతం కావడం పట్ల, ఈ సినిమాకి పనిచేసిన అందరూ నిర్మల్ ప్రాంతానికి చెందిన వారవడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు ముఖ్య అతిధిగా హాజరయిన మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి.
నిర్మల్‌ చుట్టపక్కల ప్రాంతంలోనే పూర్తిగా మా ఊరి రాజారెడ్డి సినిమాని చిత్రీకరించామన్నారు నిర్మాత వెంకటరమణ. సినిమా తప్పక విజయం సాధిస్తుందన్నారు.
సినిమా నటనను కెరీర్‌గా ఎంచుకుంటానంటే అన్ని విధాలా ప్రోత్సాహించింది మా అమ్మగారే అన్నారు హీరో నిహాన్‌. తన పేరెంట్స్‌కి, దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు నిహాన్.

Related Posts