బాలకృష్ణ-బాబీ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టేసిన బాలయ్య ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న తన 109వ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట బాబీ. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తిచేసుకుంది ఈ సినిమా. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కనిపించనుంది.

అయితే.. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ఎవరు నటిస్తారనేది అభిమానులను ఊరిస్తున్న ప్రశ్న. లేటెస్ట్ గా ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. బాలయ్యకి జోడీగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేశాడట డైరెక్టర్ బాబీ. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. ఇక.. సంక్రాంతి బరిలో వచ్చిన వెంకటేష్ ‘సైంధవ్’లోనూ శ్రద్ధా కనిపించింది.

మరోవైపు షూటింగ్ సూపర్ స్పీడులో జరుగుతున్నా.. ఇంకా కథానాయికను ఎంపిక చేయని సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాటిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో నలుగరు లేదా ఐదుగురు నాయికలు ఉంటారనే ప్రచారం ఉంది. కానీ.. ఇప్పటివరకూ ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే.. నితిన్, వెంకీ కుడుముల ‘రాబిన్ హుడ్’ పరిస్థితీ అదే. ఈ సినిమాలో ముందుగా రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల అన్నారు.

Related Posts