పక్కా ప్లానింగ్ తో ‘బేబి‘ ప్రొడ్యూసర్

జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన ఎస్.కె.ఎన్. కి ‘బేబి‘ చిత్రం అఖండ విజయాన్నందించింది. చిన్న చిత్రంగా విడుదలైన ‘బేబి‘ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇదే స్పీడులో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో పెట్టాడు ఎస్.కె.ఎన్.

తమ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోయే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించే వాళ్లు వీళ్లే అంటూ ఓ నలుగురు యంగ్ డైరెక్టర్స్ తో కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఎస్.కె.ఎన్. వీరిలో ‘బేబి‘ డైరెక్టర్ సాయి రాజేష్ ఒకడు. ఇక.. ‘కలర్ ఫోటో‘తో నేషనల్ లెవెల్ లో అవార్డు అందుకున్న సందీప్ రాజ్ మరో దర్శకుడు. ఇంకా.. ‘ఇంకోసారి‘ ఫేమ్ సుమన్ పాతూరి, ఆహా వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్‘కి రైటర్ గా పనిచేసిన రవి నంబూరి కూడా ఈ లిస్టులో ఉన్నారు. మొత్తంమీద.. ‘బేబి‘ తర్వాత ఇకపై సినిమాల జోరు పెంచబోతున్నాడు ఎస్.కె.ఎన్..

Related Posts