అసలు సెప్టెంబర్ లో మూడు వారాల గ్యాప్ లో రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు షారుఖ్ ఖాన్, ప్రభాస్. షారుఖ్ నటించిన ‘జవాన్‘, ప్రభాస్ ‘సలార్‘ సినిమాలు మూడు వారాల గ్యాప్ లో రావాల్సింది. కానీ.. ‘సలార్‘ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వకపోవడంతో డిసెంబర్ 22కి పోస్ట్ పోన్ అయ్యింది. ‘జవాన్‘ యాధివిధిగా విడుదలై బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది.

‘సలార్‘ ఇప్పుడు డిసెంబర్ 22న రాబోతుంది. ఇక అదే రోజున నెలల ముందుగానే విడుదల తేదీ ఖరారు చేసుకున్న చిత్రం ‘డంకి‘. ‘పఠాన్, జవాన్‘ విజయాలతో మంచి ఊపుమీదున్న షారుఖ్ నుంచి వస్తోన్న సినిమా ఇది. అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. దాంతో.. ‘డంకి‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక.. ఎప్పుడైతే ‘సలార్‘ డిసెంబర్ 22కి షిప్టయ్యిందో ‘డంకి వర్సెస్ సలార్‘ క్లాష్ ఓ రేంజులో ఉండబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం డిసెంబర్ క్లాష్ నుంచి ‘డంకి‘ తప్పుకోబోతుందట. ‘సలార్‘తో క్లాష్ ఒక కారణమైతే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వకపోవడం మరో కారణమనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ‘డంకి‘ పోస్ట్ పోన్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. మొత్తంమీద.. ‘డంకి‘ పోస్ట్ పోన్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో ‘సలార్‘ ఓపెనింగ్స్ కి తిరుగేలేదు.