జైలర్ టీమ్ కు గిఫ్ట్ లు

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్. చాలా యేళ్ల తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రజినీకాంత్. ఈ మూవీతో ఏకంగా 600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. అస్సలెవరూ ఊహించని సక్సెస్ ఇది. ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అంతకు ముందు బీస్ట్ తో డిజాస్టర్ చూశాడు. అయినా రజినీ అతన్ని నమ్మాడు. ఆ నమ్మకాన్ని సూపర్ స్టార్ కూడా ఊహించని రేంజ్ లో నిలబెట్టుకున్నాడు నెల్సన్. అందుకు గానూ నిర్మాత నుంచి చాలా ఖరీదైన కార్ ను కూడా బహుమతిగా అందుకున్నాడు. అఫ్ కోర్స్ రజినీకి అంతకు మించిన కాస్ట్ లీ గిఫ్ట్ లు అందాయనుకోండి.


ఈ చిత్ర నిర్మాతలు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. తెరపై కనిపించిన వారినే కాదు.. తెర వెనక ఉన్నవారిని కూడా గుర్తించాలనుకున్నారు. అందుకోసం జైలర్ అన్న టైటిల్ తో కొన్ని గోల్డ్ కాయిన్స్ తయారు చేయించారు. ఆ కాయిన్స్ ను ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ అందించబోతున్నారు.

మరి ఇది టెక్నికల్ టీమ్ కు మాత్రమే అందిస్తారా లేక ప్రధాన ఆర్టిస్టులకు కూడా అందిస్తారా అనేది తెలియదు కానీ.. వీళ్లు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా బ్లాక్ బస్టర్ కొట్టబోయే నిర్మాతలందరికీ సవాల్ గా మారుతుంది. వీళ్లలాగే అందరూ ఇవ్వాలని కాదు కానీ.. చాలా వరకూ ఆశిస్తారు. ఇవ్వకపోతే కంపేర్ చేస్తూ కామెంట్స్ కూడా చేస్తారు. ఏదేమైనా తమ విజయాన్ని తమతో పనిచేసిన అందరితో కలిసి పంచుకోవాలన్న జైలర్ నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ను అభినందించాల్సిందే.

Related Posts