గెట్టింగ్ రెడీ ఫర్ ‘విశ్వంభర‘.. మెగాస్టార్ మెస్మరైజింగ్ వర్కవుట్స్

మెగాస్టార్లు, సూపర్ స్టార్లు ఊరికే అయిపోరు. ప్రతి నిమిషం, ప్రతి రోజు తమ పొజిషన్ కోసం ఎంతో కష్టపడితేనే కానీ.. ఆ రేంజ్ కు వెళ్లరు. చిరంజీవి డెడికేషన్ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 22తో 70వ పడిలోకి ప్రవేశించే మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ తన పాత్రల విషయంలో అదే అంకితభావాన్ని ప్రదర్శిస్తుంటారు.

కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్న చిరు.. తన రోల్ కోసం ఫుల్ వర్కవుట్స్ చేస్తున్నారు. ‘విశ్వంభర‘లోని పాత్ర కోసం ఆహార్యాన్ని మలుచుకుంటున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ తన జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Related Posts