మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ లో జరిగింది. ఇక ఇటీవలే వీరిద్దరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇప్పటివరకూ వీరి వివాహానికి సంబంధించిన తేదీపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే వరుణ్, లావణ్య ల వివాహం ఇటలీలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 1న వీరి వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించారట. ఇటలీ దేశంలోని టుస్కానీ వద్ద నున్న బోర్గో శాన్ ఫెలోస్ గ్రాండ్ రిసార్ట్ లో వీరి వివాహం జరగనుందట. ఈ వివాహ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులంతా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత నాలుగు వారాల పాటు కొత్త దంపతులు వివిధ ప్రపంచదేశాల్లో హనీమూన్ ప్లాన్ చేశారట. త్వరలోనే వరుణ్, లావణ్య వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.