ఆరు కోట్ల విలువైన కారు కొంటున్న డైరెక్టర్

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఈ పేరు ఓ సంచలనంగా మారింది. కేవలం మూడు సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించాడు. తన పేరు మీదే ఓ సినిమాటిక్ యూనివర్శ్ ను సృష్టించి.. అందులో మొదటి చిత్రంగా ‘హనుమాన్’ తీసి.. ఘన విజయాన్ని సాధించాడు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హనుమాన్’ ఇప్పటివరకూ 300 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇంకా.. లాంగ్ రన్ లో ఈ సినిమా సృష్టించే సంచలనాలు చాలానే ఉండబోతున్నాయనేది ట్రేడ్ వర్గాల అంచనా.

సినిమా సినిమాకి తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు పాన్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీయెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు. ఈనేపథ్యంలోనే.. తన లైఫ్ స్టైల్ ను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోబోతున్నాడు. లేటెస్ట్ గా ఆరు కోట్ల విలువైన ఓ హై ఎండ్ కారును బుక్ చేశాడట ప్రశాంత్ వర్మ. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. ‘హనుమాన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. సీక్వెల్ ‘జై హనుమాన్’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను జోరుగా కొనసాగిస్తున్నాడు. ‘జై హనుమాన్’లో హనుమంతుడు, శ్రీరాముడు పాత్రల కోసం చాలామంది హీరో పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో హనుమాన్ గా చిరంజీవి.. శ్రీరాముడుగా మహేష్ బాబు నటిస్తారనే ప్రచారం ఉంది. ‘జై హనుమాన్’ లీడ్ యాక్టర్స్ పై త్వరలో క్లారిటీ రానుంది.

Related Posts