అంచనాలు పెంచుతున్న నాగ చైతన్య

అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు సక్సెస్ స్ట్రగుల్ లో ఉంది. నాగ్ నుంచి అఖిల్, చైతూ.. ఇలా అందరి సినిమాలూ వరుసగా పోతున్నాయి. రీసెట్ గా వచ్చిన అఖిల్ ఏజెంట్ అయితే ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. అంతకు ముందు చైతన్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా రూపంలో రెండు ఫ్లాపులు చూసి ఉన్నాడు. ఇక నాగ్ అయితే ఓ మంచి హిట్ కొట్టి ఏళ్లైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నాగ చైతన్య కస్టడీ మీదే ఉంది. ఈ మూవీ మొదట్నుంచీ ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అంచనాలు పెంచుతూ వెళుతోంది.


ఈ నెల 12న తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న కస్టడీ మూవీ అక్కినేని క్యాంప్ కు భారీ బూస్టప్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు చాలామంది. అందుకు ప్రధాన కారణం ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు. వెంకట్ సినిమా అంటే ఫ్లాప్ అయినా డిజప్పాయింట్ చేయదు. ఒక్కోసారి కమర్షియల్ గా పోయినా.. విమర్శియల్ గా విపరీతంగా మెప్పిస్తుంది. పైగా టేకింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ సర్ ప్రైజ్ చేస్తాడు వెంకట్ ప్రభు.

రీసెంట్ గా అతను తీసిన మానాడు సినిమా ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం తమిళ్ లో రావడం వల్లే ఈ మూవీకి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు. అలాంటి దర్శకుడు నాగ చైతన్యతోనే సినిమా చేయాలని రావడం.. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ప్రతిదీ ప్రామిసింగ్ గా కనిపిస్తుండటంతో చైతూ కస్టడీతో బ్లాక్ బస్టర్ కొడతాడు అనే నమ్మకం అందర్లోనూ కనిపిస్తోంది.


ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలాలు మరో రెండు ఉన్నాయి. చైతన్య, కృతిశెట్టితో పాటు ఇతర ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ఎసెట్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారికీ ఒప్పుడుమోస్ట్ ఫేవరెట్ అయిన అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండటం ప్లస్ అవుతుంది.

అతను ఆల్రెడీ రామ్ చరణ్‌ ధృవలో అలరించాడు. పైగా తన పాత్ర, కథ బలంగా లేకపోతే అతను సినిమా ఒప్పుకోడు. అలాంటి అరవింద్ ఓకే చెప్పడం సగం విజయం అంటున్నారు.దీనికి మించి మరో బిగ్ సక్సెస్ ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు ఫస్ట్ టైమ్ ఒకే సినిమాకు పనిచేయడం. ఈ ఇద్దరి పాటలు, నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుందని నాగ చైతన్య పదే పదే చెబుతున్నాడు.

అతను చెప్పడమే కాదు.. ట్రైలర్ లోనే ఓ రేంజ్ లో కనిపిస్తోంది ఆర్ఆర్.
మొత్తంగా చూస్తే కస్టడీకి బ్లాక్ బస్టర్ కళ కనిపిస్తోంది. పైగా చైతూకు పెద్దగా పోటీ కూడా లేదు. ఈ టైమ్ లో నిజంగానే సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ చేసేస్తారు ఆడియన్స్. మరి ఈ మూవీతో అక్కినేని క్యాంప్ కు కొత్త ఉత్సాహం వస్తుందేమో చూడాలి.

Related Posts