విజయ్ తెలుగు సినిమాకు టైమ్ వచ్చింది..

కోలీవుడ్ సూపర్ స్టార్.. విజయ్ తెలుగు సినిమా చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఫస్ట్ టైమ్ విజయ్ ఓ తెలుగు స్ట్రెయిట్ మూవీకి ఓకే చెప్పాడు. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో. దర్శకుడు వంశీ పైడిపల్లి. తుపాకీ చిత్రం నుంచి విజయ్ కి తెలుగులో మార్కెట్ మొదలైంది. కొన్నాళ్లుగా అతని సినిమాలు మనవాళ్లనూ బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం అతను కేవలం కోలీవుడ్ ఆడియన్సెస్ ను మాత్రమే టార్గెట్ గా సినిమాలు చేయడం లేదు. యూనివర్సల్ కంటెంట్ ను ఎంచుకుంటున్నాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాడు. ఈ కారణంగానే పోలీసోడు, మెర్సల్, భైరవ, విజిల్ వంటి సినిమాలు తెలుగులోనూ బానే ఆకట్టుకున్నాయి. అయితే ఇతర తమిళ్ హీరోలతో పోలిస్తే విజయ్ కి ఇక్కడ మార్కెట్ తక్కువ. దీంతో ఒకేసారి మార్కెట్ పై దండయాత్రగా స్ట్రెయిట్ మూవీకే ఓకే చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
గతంలోనే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుందనుకున్నారు చాలామంది. బట్.. ఆ టైమ్ లో అతను నెల్సన్ దిలీప్ కుమార్ అనే తమిళ దర్శకుడితో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. లేటెస్ట్ గా బీస్ట్ కు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ మూవీ తర్వాత ఇక వంశీతోనే స్టార్ట్ అవుతుంది. ఇటు వంశీ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని విజయ్ కోసమే ఎదురుచూస్తున్నాడు. సో.. అన్నీ కుదిరితే జనవరి నుంచే విజయ్ తెలుగు సినిమా మొదలవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts