సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న టిల్లు

ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాలు లేవు. కేవలం బంగార్రాజు మాత్రమే వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ వాయిదా తర్వాత వరసగా పోటీలు పడి మరీ చాలా చిన్న సినిమాలు సంక్రాంతి రిలీజ్ అంటూ కొత్త పోస్టర్స్ కొట్టి వదిలేశాయి. ఓ దశలో ఏకంగా ఏడెనిమిది సినిమాల వరకూ సంక్రాంతికి వస్తున్నాయి అనుకున్నారు చాలామంది. బట్ పోస్టర్స్ వేసినంత సులువు కాదు కదా.. రిలీజ్ చేయడం. అందుకే అలా అనౌన్స్ చేసిన చాలా సినిమాలు మళ్లీ సైలెంట్ అయిపోయాయి. ఫైనల్ గా బంగార్రాజు, రౌడీబాయ్స్, డిజే టిల్లు, హీరో, సూపర్ మచ్చి చిత్రాలు మిగిలాయి.
వీటిలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి గురించి ఏ సందడి లేదు. చిన్న ప్రమోషనల్ ఈవెంట్ కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ మూవీ రావడం లేదు అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా డిజే టిల్లును కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సితార బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందనుకున్నారు. రీసెంట్ గా ఓ సాంగ్ కూడా విడుదల చేసి సందడి చేశారు. దీంతో గ్యారెంటీ రిలీజ్ అనుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇదే బ్యానర్ లో రూపొందిన భీమ్లా నాయక్ ను వాయిదా వేయించారు కదా.. ఆ ప్లేస్ లో ఆ బ్యానర్ లోనే రూపొందిన డిజే టిల్లు వస్తుందనుకున్నారు. మరి ఏమైందో కానీ డిజే టిల్లు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి, ప్రిన్స్ సీసిల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించిన సినిమా డిజే టిల్లు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన కథగా వస్తుందని ఆ మధ్య టీజర్ చూసినప్పుడే అర్థమైంది. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సిద్ధునే అందించడం విశేషం. మరి ఎందుకు వాయిదా వేశారు.. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది త్వరలోనే చెబుతారట.

Related Posts