ఇండస్ట్రీ కి దాసరి లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది – నిర్మాత సి కళ్యాణ్

చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్యను అయినా గతంలో ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడేవాళ్లం. ఇప్పుడు పరిశ్రమ నుంచి అలాంటి ఐఖ్యత కరువైంది అంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. దాసరి గారు ఉన్నప్పుడు ఆయన ముందుండి మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన లేని లోటు తెలుస్తోంది అని చెప్పారు సి కళ్యాణ్. ఆయన నిర్మించిన గాడ్సే సినిమా ప్రమోషన్ లో సి కళ్యాణ్ చిత్ర పరిశ్రమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సి కళ్యాణ్ మాట్లాడుతూ..నేను నిర్మించిన గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. ఇక మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొపే చిత్రం. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.

ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు. పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోంది. అన్నారు

Related Posts