సమంతకు డెడ్ లైన్ పెట్టిన దర్శకుడు

లాస్ట్ ఇయర్ చాలా ఇష్యూస్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది సమంత. అందులో అందరికీ షాక్ ఇచ్చిన అంశం తనకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం. మొదట్లో ఈ వ్యాధి గురించి అవగాహన లేనివారు సమంతకు ప్రాణాంతకం అని కూడా చెప్పుకున్నారు. అయితే ఈ కారణంగా తను అప్పటికే స్టార్ట్ అయిన ఖుషీ మూవీ షూటింగ్ ఆగిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా సమంత కోలుకుంది. దీంతో తమ సినిమా షూటింగ్ కు వస్తుందని భావించారు ఖుషీ మేకర్స్.

బట్ తను మాత్రం బాలీవుడ్ లో చేస్తోన్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కు వెళ్లింది. శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచింగ్ కూ వచ్చింది. తను వెబ్ సిరీస్ కు వెళ్లిన తర్వాత ఖుషీ కథలో మార్పులు కావాలి అని అడిగింది అనే న్యూస్ వచ్చాయి. అవి నిజం కాదు అని సమంత టీమ్ కూడా ఖండించలేదు. ఇటు చూస్తే సమంత ఖుషీ షూటింగ్ కు వచ్చేది లేనిదీ అప్డేట్ చెప్పడం లేదు. దీంతో తమ చిత్రానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది పోయి .. బాలీవుడ్ కు వెళ్లడంపై దర్శకుడికి కోపం వచ్చింది.

మరోవైపు కథలో మార్పుల విషయంలోనూ అతను సీరియస్ అయ్యాడట. దీంతో ఈ మార్చి వరకూ షూటింగ్ కు వస్తే ఓకే.. లేదంటే తను వేరే ప్రాజెక్ట్ చూసుకుంటానని నిర్మాతలకు స్ట్రాంగ్ గా చెప్పాడట. అంతేకాదు.. సమంతపై చర్యలు తీసుకునేందుకూ ఆయా సంఘాలను ఆశ్రయిస్తాం అని కూడా వార్నింగ్ ఇచ్చాడట. మరి ఈ ఫిబ్రవరిలో సమంత నటించిన శాకుంతలం రిలీజ్ ఉంది. ఆ టైమ్ లో తను ఇచ్చే ఇంటర్వ్యూస్ లో వీటికి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చెప్పలేం కానీ.. దర్శకుడి కోపంలో మాత్రం నిజాయితీ ఉందనే చెప్పాలి.

Related Posts