ప‌వ‌న్ గురించి త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి.. ద‌ర్శ‌క‌నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. అలాగే సినిమా అయినా.. రాజ‌కీయాలు అయినా.. సుత్తి లేకుండా సూటిగా ప్ర‌శ్నించ‌డం.. త‌న మ‌న‌సులో మాట‌ల‌ను ఎలాంటి భ‌యం లేకుండా బ‌య‌ట‌పెట్ట‌డం చేస్తుంటారు. అయితే.. తాజాగా త‌మ్మారెడ్డి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో జ‌గ‌న్ పాల‌న బాగుంటే.. నేను మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. మ‌రి.. జ‌గ‌న్ పాల‌న బాగుంద‌నా..? ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చారు అనే ప్ర‌శ్నే ఎదురైంది.

ఈ ప్ర‌శ్న‌కు తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ స్పందిస్తూ.. పవన్ సినిమాలు మానేసి ఉంటే మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడాలి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను నేను చూడలేదు గానీ .. ఇప్పుడు పవన్ 5 సినిమాలు ఒప్పుకున్నాడు కాబట్టి జగన్ పాలన బాగున్నట్టే అనుకోవాలి. పవన్ ఎన్ని సినిమాలు చేస్తే.. ఒక పొలిటికల్ పార్టీ నడుస్తుంది. సినిమాకి 50 కోట్లు .. 100 కోట్లు తీసుకున్నాడని అనుకుందాం. ఏడాదికి రెండు సినిమాలు .. లేదంటే మూడు సినిమాలు చేస్తాడు. 300 కోట్లతో ఒక పార్టీ నడుస్తుందా .. ఈ రోజుల్లో. పార్టీ నడపాడానికి సినిమా చేస్తానంటే అది జరిగే పని కాదు .. అది నిజం కూడా కాదు నా ఉద్దేశంలో.

పవన్ డబ్బు మనిషి కాదు .. అంత వరకూ నాకు తెలుసు. ఆ డబ్బు పార్టీకే వాడతాడు కూడా .. కానీ ఆ డబ్బు చాలదు. ఆయన ఒక మాట మీదుండి .. ఒక పద్ధతిగా వెళితే ఆయనకి డబ్బు అక్కర్లేదు. పవన్ కల్యాణ్ ఎంత గొప్ప లీడర్ అంటే .. నిజంగా ఆయనను నడిపించుకోగలిగితే ఆయన ఏదైనా చేయగలడు రాష్ట్రానికి. ఆయన ఒక మాట మీద ఉంటే ఏదైనా చేయగలడు .. కానీ ఆయన ఉండటం లేదు. పదేళ్లుగా చూస్తున్నాం .. ఆయన ఏ మాట మీదా నిలబడటం లేదు. నిలకడలేని మనిషిలా అయిపోయాడు. అలా కాకుండా ఉంటే .. డబ్బు సంపాదించి తీసుకునివెళ్ల వలసిన అవసరం లేదు. ప్రజలే ఆయనను కాపాడతారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి.. భ‌ర‌ద్వాజ కామెంట్స్ పై ప‌వన్ కానీ.. జ‌న‌సేన పార్టీ కానీ స్పందిస్తుందేమో చూడాలి.

Related Posts