అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
Bollywood Latest Movies

అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అవడం బాలీవుడ్ లో సంచలనం కలిగిస్తోంది. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల రూపకల్పన చేయిస్తూ వాటిని కొన్ని యాప్స్ ద్వారా అప్ లోడ్ చేస్తున్నట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాజ్ కుంద్రా అంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. సోమవారం ఆయన్ను అదుపులోకి తీసుకుని రాత్రంతా కస్టడీలో ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్ కుంద్రాను న్యాయస్థానంలో హాజరుపర్చగా..కోర్టు ఆయనకు ఈనెల 23 దాకా పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ పోర్నోగ్రఫీ వీడియో కేసులో రాజ్ కుంద్రా కీలకంగా వ్యవహరించారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ తెలిపారు.

బ్రిటన్ లో ఉంటున్న తన సోదరుడి ద్వారా రాజ్ కుంద్రా ఈ పోర్నోగ్రఫీ వ్యాపారం ప్రారంభించాడని పోలీసులు గుర్తించారు. కెన్రిన్ అనే కంపెనీ ప్రారంభించి, దాని ద్వారా ఈ వీడియోలు విడుదల చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యాపారంలో రాజ్ కుంద్రా 8 నుంచి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడని గుర్తించారు. ముంబైైలో పోర్న్ వీడియోలు షూటింగ్ చేసి వీ ట్రాన్స్ ఫర్ ద్వాారా లండన్ లోని కెన్రిన్ కంపెనీకి ట్రాన్స్ ఫర్ చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాతో పాటు మొత్తం 12 మందిని ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. ముంబై మోడల్ గెహనా వశిష్ట్ ఈ వీడియోల్లో నటించిందని అరెస్టయిన వారిలో కో ఆర్డినేటర్ గా పనిచేసిన ఉమేష్ కామత్ పోలీసుల ముందు అంగీకరించాడు.

బ్రిటన్ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా గతంలో క్రికెట్ స్పాట్ బెట్టింగ్ లోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. శిల్పా శెట్టితో కలిసి ఐపీఎల్ లో ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన వ్యవహారంలోనూ ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ జరిపాయి. ఈ కేసుల నుంచి బయటపడిన రాజ్ కుంద్రా…ఇప్పుడు పరువు పోయే పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్నారు. గతంలోని కేసులు అవినీతి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాగా…వ్యాపారంలో ఇలాంటివేవో సహజం అనుకునేవారు కూడా ఇప్పుడీ పోర్నోగ్రఫీ కేసు గురించి తెలిసి ఛీ అనుకోవడం ఖాయం. రాజ్ కుంద్రా కంటే అతని భార్య శిల్పా శెట్టి బయట తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. బాలీవుడ్ లో తారగా ఆమెకో ప్రముఖ స్థానముంది. భర్త చేసిన పనికి ఆమె సమర్థన కూడా చేయలేని కేసు ఇది.

శిల్పా శెట్టి లండన్ వెళ్లిన సందర్భంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రా పరిచయం అయ్యాడు. లండన్ ఉన్న కొద్ది రోజులు తన బ్యాచ్ లర్ ఫ్లాట్ లో ఉండమని రాజ్ కుంద్రా శిల్పాకు హెల్ప్ చేశాడు. ఇలా వీళ్ల మధ్య స్నేహం ప్రేమగా మారింది. రాజ్ కుంద్రాకు అప్పటికే కవిత అనే మహిళతో వివాహం అయ్యింది. ఒక పాప కూడా ఉంది. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన శిల్పా…తన మనసు మార్చుకోలేదు. కవితతో విడాకులు తీసుకున్న తర్వాత శిల్పా శెట్టి 2009 నవంబర్ 22 న రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. 2012 మే 21న వీరికి బాబు వియాన్ పుట్టాడు. 2020 ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా కూతురు షమిషకు జన్మనిచ్చింది శిల్పా.

Post Comment