కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు శర్వానంద్. హిట్ కోసం వైవిధ్యమైన కథలు ట్రై చేసినా ఈ బాక్సాఫీస్ రణస్థలంలో విజయానికి శ్రీకారం చుట్టలేకపోయాడు. ఆఖరికి ఆడవాళ్లూ మీకు జోహార్లు అన్నా.. వాళ్లూ పట్టించుకోలేదు. చివరగా వచ్చిన ఒకేఒక జీవితంతో ఓకే అనిపించుకున్నాడు. బట్ ఇది కూడా మరీ సాలిడ్ హిట్టేం కాదు. అయినా కంటిన్యూస్ ప్రాజెక్ట్‌స్ తో ఫుల్ బిజీగా ఉంటాడు శర్వా. ప్రస్తుతం లిరిసిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారిన కృష్ణ చైతన్యతో సినిమా చేస్తున్నాడు. ఇతను అంతకు ముందు నారా రోహిత్ తో రౌడీఫెలో అనే సినిమాతో హిట్ కొట్టాడు. కానీ తర్వాత ఛల్ మోహన రంగ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి మరో సినిమా కోసం చూస్తోన్న ఇతనితో శర్వానంద్ ఇప్పుడో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మరో ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో.


మొదట్నుంచీ డిఫరెంట్ మూవీస్ చేస్తూ జర్నీ చేస్తోన్న దర్శకుడు వేణు శ్రీరామ్. అతని మేకింగ్ కు మార్కులు పడుతున్నాయి కానీ.. కంటెంట్ కు కలెక్షన్స్ రావడం లేదు. మధ్యలో యంగ్ హీరోస్ తో కలిపి శమంతకమణి అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. నాగార్జున, నానిలతో దేవదాస్ అని చేసినా అది జస్ట్ పాస్ అనిపించుకుంది. రీసెంట్ గా మహేష్‌ మేనల్లుడు గల్లా అశోక్ ను “హీరో”తో హీరోగా పరిచయం చేశాడు. కానీ ఈ సినిమా వచ్చిన సంగతి కూడా జనానికి తెలియలేదు. ఆ రేంజ్ ఫ్లాప్. అలాంటి దర్శకుడితో శర్వానంద్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.


వేణు, శర్వానంద్ కాంబోలో వచ్చే సినిమాకు ఓ కొత్త నిర్మాత ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడు.. లేదా ఓ యంగ్ ప్రొడ్యూసర్ చేయబోతున్నాడు అంటున్నారు. అయితే ఈ మధ్య వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు చూసిన కృతిశెట్టిని ఈ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. కృతిశెట్టి ఎంట్రీ బానే ఉన్నా.. జర్నీ మాత్రం జామ్ అయిపోతుంది. మొదటి రెండు మూడు సినిమాలు ఓకే అనిపించినా.. తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో కంటిన్యూస్ గా ఫ్లాపులు చూసింది. ప్రస్తుతం నాగ చైతన్యతో చేస్తోన్న సినిమా మాత్రమే తన బ్యాగ్ లో ఉంది. అలాంటి తనకు శర్వానంద్ తో ఛాన్స్ అంటే లక్ అనే చెప్పాలి. ఎలా చూసినా శర్వా కూడా ఇప్పుడు పెద్ద రైజింగ్ లో లేడు. ఓ రకంగా ఇది ఫ్లాప్ కాంబినేషనే. మరి వీరంతా కసిదీరా హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.