Latest Movies

బాలీవుడ్ లోకి సత్యదేవ్

తెలుగులో ప్రతిభావంతమైన నటుడుగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. చిన్న పాత్రలతో మొదలై ఇప్పుడు హీరోగా బిజీ అయ్యాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోన్న సత్యదేవ్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వార్తలు గతం నుంచీ వస్తున్నవే అయినా.. లేటెస్ట్ గా అతను నటించే సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘రామ్ సేతు’అనే హిస్టారికల్ ఫిక్షన్ మూవీలో సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. నిజానికి సత్యదేవ్ గతంలోనే ఓ హిందీ సినిమాలో నటించాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఇదే అతని ఫస్ట్ హిందీ మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఇక తెలుగులో గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు, గాడ్సే వంటి చిత్రాలతోనూ బిజీగా ఉన్నాడు సత్యదేవ్. వీటిలో తిమ్మరుసు ఈ నెల 30న థియేటర్స్ లోనే విడుదల కాబోతోంది.

Post Comment