మగాళ్ళది వంకర బుద్ధి అని తేల్చిన సమంత

సీకటి పడితే మగాళ్లందరి బుద్దీ ఒకటే అని తేల్చింది సమంత. తను ఫస్ట్ టైం చేసిన ఐటమ్ సాంగ్ లోనిది ఈ లైన్. ఎస్ ఇదంతా పుష్ప చేరాం లోని పాట గురించే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. మాములుగా సుక్కు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చాలా సిజిలింగ్ గా ఉంటాయి. అలాంటి పాట సమంత చేస్తుంది అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు .
ఇక లేటెస్ట్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ సాంగ్ విడుదల చేశారు. కొందరి ఊహలకు భిన్నంగా ఐటెం సాంగ్ లో ఫిలాసఫీ చెప్పాలి లిరిసిస్ట్ చంద్రబోస్. మామూలుగా ఈ మూవీలోని పాటలన్ని ఏదో ఒక వేదాంతం టోన్ వస్తున్నాయి ఆఖరుకి ఐటెం పాట లోను అదే జోడించాడు చంద్రబోస్.
ఏమాటకామాటే.. బోస్ రచన చాలాబావుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సాహిత్యం స్పష్టానంగా వినిపించేలా ఉంది. ట్యూన్ కూడా చాల క్యాచీగా ఉంది. ఐటమ్ సాంగ్ అంగాన్ని వినిపించే ఒక రకమైన టోన్ కల్చర్ ను హస్కీనెస్ ను అద్భుతంగా పలికించింది గాయని ఇంద్రావతి చౌహాన్ . సింపుల్ గా చెబితే విడాకులు తర్వాత సమంత ఫస్ట్ టైమ్ వెండితెరపై కనిపించబోతోన్న ఈ పాట మాస్ ను ఊపేస్తుందని చెప్పొచ్చు .

Related Posts