ప్రభాస్ రాధేశ్యామ్ తో సై అంటోన్న బచ్చన్ పాండే

కరోనా కారణంగా అన్ని సినిమాలూ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిలీజ్ డేట్స్ రెండు మూడుసార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఖచ్చితంగా వస్తాయి అనుకున్న దశ నుంచి కూడా అవుట్ అయిపోయిన సినిమాలూ ఉన్నాయి.  ఈ క్రమంలోనే ఉన్న సినిమా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్. ఎప్పుడో వస్తుందనుకున్న ఈ చిత్రం చివరికి ఈ సంక్రాంతికి వస్తుంది అని చెప్పారు. బట్.. చివరి నిమిషంలో వీళ్లూ పోస్ట్ పోన్ చేశారు. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. వీరికంటే ముందే ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. ఆ సినిమా మళ్లీ ఎప్పుడు విడదలవుతుందో చెప్పలేం కానీ.. రాధేశ్యామ్ ను మాత్రం మార్చి 18న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అప్పటికి పెద్ద సినిమాలేం లేవు. కానీ లేటెస్ట్ గా డార్లింగ్ స్టార్ కుపోటీ ఇస్తూ బచ్చన్ పాండే కొత్త నిర్ణయం తీసుకున్నాడు.
అక్షయ్ కుమార్ కొత్త సినిమా బచ్చన్ పాండే. ఓ రకంగా చెబితే ఇది కూడా రాధేశ్యామ్ లాంటిదే. చిత్రీకరణ పరంగా రాధేశ్యామ్ కుఏ మాత్రం తీసిపోకుండా యేళ్ల తరబడి షూట్ చేశారు. ఇంకా చెబితే షూటింగ్ మొదలైనప్పుడు ఈ మూవీనిని 2020 డిసెంబర్ లో విడుదల చేస్తాం అన్నారు. తర్వాత 2021 జనవరి అన్నారు. అదీ పోయింది సో.. యేడాదిన్నర ఆలస్యం అయింది. ఇటు రాధేశ్యామ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వాళ్లూ అంతే. ఎప్పుడు వస్తారో చెప్పకుండానే అభిమానులను ఎంతో ఇబ్బంది పెట్టారు. మొత్తంగా దాదాపు ఒకే తరహాలో ఉన్న ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.

 

Bachchan Pandey (2022) - IMDb
యస్.. మామూలుగా ఒక పెద్ద సినిమా ఉన్నప్పుడు అదే రోజు మ