రూ. 350 కోట్లకు “రాధే శ్యామ్” ఓటీటీ డీల్?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్ కు వస్తోందన్న వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదలకు ముందు ప్లాన్ చేసినా థర్డ్ వేవ్ తో వాయిదా వేశారు. రాధే శ్యామ్ ప్యాన్ ఇండియా కావడంతో తెలుగులో రిలీజ్ చేస్తే సరిపోతుందనే పరిస్థితి లేదు. ఉత్తరాది రాష్ట్రాలతో సహా దేశమంతా థర్డ్ వేవ్ ప్రభావంలో పడిపోయింది. దీంతో రాధే శ్యామ్ థియేట్రికల్ రిలీజ్ వాయిదా తప్పలేదు. స్టార్ల చిత్రాలకున్న క్రేజ్ తో ఓటీటీలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ టెంప్ట్ చేస్తుండటం సహజం. గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్ ల టైమ్ లో పలు క్రేజీ చిత్రాలు ఓటీటీల బాట పట్టాయి. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా అదే నిర్ణయం తీసుకుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఓ పెద్ద స్టార్ సినిమా పడితే అటు సబ్ స్క్రిప్షన్స్, స్ట్రీమింగ్ టైమ్ పెద్ద ఎత్తున పెరుగుతాయన్నది ఓటీటీల ప్లాన్. అందుకే క్రేజీ సినిమాలకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటీటీలు దాదాపు 350 కోట్ల రూపాయల దాకా ఆఫర్ చేస్తున్నాయి. ఈ అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అయితే యూవీ నిర్మాతలు మాత్రం రాధే శ్యామ్ మొత్తం మేకింగ్ ఖర్చు, దానికున్న క్రేజ్ కు తక్కువేనని భావిస్తున్నారు. ఇక్కడే ఇటు ప్రొడక్షన్ హౌస్, అటు ఓటీటీ ల డీల్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. కొంత అటూ ఇటూగా రాధే శ్యామ్ ఓకే అయినా అవ్వొచ్చనేది మరో అంచనా. మరో రెండు నెలల దాకా ప్రస్తుత థర్డ్ వేవ్ పరిస్థితులు చక్కబడేలా లేవు. అప్పటిదాకా థియేట్రికల్ రిలీజ్ ఊహించడం కూడా కష్టమే. అందుకే ఓటీటీ ఒక ఆప్షన్ లా కనిపిస్తోంది.

రాధే శ్యామ్ తో పాటు పండక్కి రిలీజ్ అనున్న భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్ టెంటటివ్ గా కొన్ని డేట్స్ అనుకుంది. ఏప్రిల్ 29కు ఈ సినిమా రావొచ్చని తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. వీటితో పాటు వాయిదా పడిన రాధే శ్యామ్ మాత్రం అంచనాకు కూడా డేట్ ను ప్రకటించలేకపోతోంది. ఇక్కడే స్పెక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. గట్టి ఆఫర్ సెట్ అయితే ఓటీటీకి రాధే శ్యామ్ వెళ్లిపోవచ్చని ట్రేడ్ వర్గాలుంటున్నాయి. ప్రభాస్ నటించిన సినిమా కావడం, భారీ బడ్జెట్, ఎక్ట్రార్డినరీ విజువల్స్, హాలీవుడ్ స్టాండర్డ్ మేకింగ్ ఉన్న రాధే శ్యామ్ ను థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తామనేది ఫిల్మ్ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ మాట.

Related Posts