ఆర్ఆర్ఆర్.. ఆ నలుగురి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ట్రిపుల్ ఆర్.. అనుకోకుండా వ్యాప్తి చెందుతోన్న కరోనా వల్ల మరోసారి వాయిదా పడింది కానీ.. లేదంటే ఇప్పటికే ఈ సినిమా సాధించిన రికార్డులు, కలెక్షన్స్ గురించి అదే పనిగా చెప్పుకుంటూ ఉండేవాళ్లం. కొన్ని సినిమాలు ఆలస్యం అయినా.. వాటిలోని మ్యాజిక్ తగ్గదు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న ఈచిత్రం టాలీవుడ్ టాప్ హీరోల మల్టీస్టారర్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని దేశవ్యాప్తంగా విస్తరించడంలో వాళ్లు చేసిన ప్రమోషన్ ఓ రేంజ్ లో ఉపయోగపడింది. బట్.. అనూహ్యంగా వాయిదా పడాల్సి రావడం ఆర్ఆర్ఆర్ అభిమానులను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక సినిమా బడ్జెట్ పరంగా 400 కోట్లు అయిందని ముందు నుంచీ చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ 960కోట్లు అయింది. అంటే ఇంకా డిజిటల్ రైట్స్ ఉన్నాయి. శాటిలైట్ రైట్స్ కూడా మిగిలే ఉన్నాయి. అవి సులువుగా మరో మూడు నాలుగు వందల కోట్లు రాబడతాయి అని చెప్పొచ్చు. అయితే బడ్జెట్ పరంగా భారీగా ఉన్న ఈ చిత్రంలో నటించిన ఎన్టీఆర్, చరణ్ లతో పాటు కీలక పాత్రలు చేసిన అజయ్ దేవ్ గణ్, అలియాభట్ ల పారితోషికం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వాస్తవం వేరే ఉంది.
ఖచ్చితమైన సోర్స్ ద్వారా తెలిసిన నిజం ఏంటంటే.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఒక్కొక్కరికి 55 కోట్లు ఇచ్చారు. అంటే ఇద్దరికీ కలిపి 110కోట్లు అన్నమాట. ఇక భగత్ సింగ్ ను గుర్తుకు తెచ్చే పాత్రలో నటించిన అజయ్ దేవ్ గణ్ కు ఏకంగా 35కోట్లు ఇచ్చారు. ఆయన ఇమేజ్ కు ఇది పెద్ద అమౌంట్ కాదు. కానీ పాత్ర చాలా చిన్నదేనట. అయినా ఆ ఇమేజ్ వాల్యూను సినిమాకు వాడారు కాబట్టే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక పాత్ర పరంగా అలియాది కూడా మరీ లెంగ్తీ రోల్ కాదు. కానీ తన ఇమేజ్ కూడా నార్త్ బిజినెస్ కు అవసరం అవుతుంది. ఆ కారణంగానే తనకూ 9 కోట్లు ఇచ్చారు. మామూలుగా తన రెమ్యూనరేషన్ 9 -12కోట్ల మధ్యలో ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తనే ఆయా సినిమాల బాధ్యతలను ఎక్కువగా మోస్తుంది. బట్ ఈ సారి ఆ అవసరం లేకపోయినా.. తన కోసం అంతే పారితోషికం ఇచ్చారు.
మరి ఈ మొత్తానికి బాస్ అయిన రాజమౌళికి ఎంత ఇచ్చి ఉంటారు అనుకుంటున్నారా..? వెరీ సింపుల్.. దాదాపు 100కోట్లకు పైగా కొన్ని ఏరియాల హక్కులు తీసుకుంటాడాయన. ఆ వందలోనే తన ఫ్యామిలీ (కీరవాణి కాకుండా) మొత్తం సినిమా కోసం పనిచేస్తుందన్నమాట. అదీ మేటర్.

Related Posts