‘బిగ్ బాస్’ తమిళ సీజన్ 8ని హోస్ట్ చేయడం నుంచి కమల్ హాసన్ తప్పుకున్న తర్వాత.. నిర్వహకులు ఆయన స్థానంలో విజయ్ సేతుపతిని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ‘బిగ్ బాస్’ తమిళ సీజన్ 8ని హోస్ట్ చేయడానికి విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
గత ఏడు సంవత్సరాలుగా ‘బిగ్ బాస్’ తమిళను హోస్ట్ చేసిన కమల్ హాసన్ తన ప్రస్తుత సినిమా కమిట్ మెంట్స్ కారణంగా ఈ సీజన్ నుంచి హోస్ట్ గా తప్పుకున్నట్టు ప్రకటించాడు. షో నుంచి తప్పుకుంటున్నట్లు కమల్ హాసన్ స్వయంగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాడు. విజయ్ సేతుపతితో పాటు, లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు కూడా ‘బిగ్ బాస్-8’ తమిళ హోస్ట్ కోసం ప్రధానంగా వినిపిస్తుంది.