ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి అరుదైన గౌర‌వం

ది తాష్కెంట్ ఫైల్స్ విజయం తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన‌ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ఇందులో మిథ‌న్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. చాలా ఎమోష‌న‌ల్ గా.. చాలా ఇంట్ర‌స్టింగ్ ఉంది. ఈ సినిమా క‌థ కోసం ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి చాలా రీసెర్చ్ చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసల పై విస్తృతమైన పరిశోధన తర్వాత కాశ్మీర్ ఫైల్స్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు.

హిమాలయాలలోని ఒక ప్ర‌దేశంలో కొన్నాళ్లు పాటు అక్క‌డే ఉండి ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ఇక షూటింగ్ చేస్తున్న టైమ్ లో చాలా అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. వాట‌ని అన్నింటిని విజ‌య‌వంతంగా దాటుకుని షూటింగ్ పూర్తి చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తుంది. ఎమోష‌న‌ల్ గా సాగిన ఈ సినిమా పై సినీ విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంలు కురిపిస్తుండ‌డం విశేషం.

న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో ఈ చిత్రాన్ని ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని చెప్ప‌చ్చు. ప్ర‌పంచంలోనే ఏ సినిమాకైనా ఇలాంటి ప్ర‌చారం ల‌భించ‌డం అరుదైన గౌర‌వం. ఈ ఘ‌న‌త‌ను ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దక్కించుకోవ‌డం విశేషం.

Related Posts