రామబాణం వర్సెస్ ఉగ్రం.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?

మేచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా నటించిన సినిమా రామబాణం. గోపీచంద్ తో గతంలో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు, ఖుష్బూ మరో ప్రధాన జంటగా కనిపించబోతున్నారు.

అన్నదమ్ముల బాండింగ్ తో పాటు డిఫరెంట్ ఎమోషన్స్ ను డీల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ప్రమోషన్స్ లో చెబుతున్నారు. ట్రైలర్ ఇంపాక్ట్ భారీగా ఉంది అని చెప్పలేం కానీ.. గోపీచంద్ నుంచి మాస్ కోరుకునే అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎమోషనల్ గా ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి అనేదాన్ని బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

అయితే పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అలాగే జగపతిబాబు పాత్ర ట్రైలర్ లో చూస్తేనే ఊహించే విధంగా కనిపిస్తోంది. ఆ పాత్ర నుంచి ఊహలకు భిన్నంగా ఏదైనా ట్విస్ట్ లు ఉంటే తప్ప ఆడియన్స్ కు కనెక్ట్ కాదు. బట్ ఇటు గోపీచంద్ తో పాటు దర్శకుడు శ్రీవాస్ కూడా ఒక బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నారు. ఇది వారి నమ్మకాన్ని నిలబెడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి వారి నమ్మకం నిజం అయ్యి.. రామబాణం బాక్సాఫీస్ టార్గెట్ లో సూపర్ హిట్ అనే పక్షి క