రాజ’శేఖ‌ర్’ గెట‌ప్ అండ్ స్టైల్ అదిరింది
Latest Movies Tollywood

రాజ’శేఖ‌ర్’ గెట‌ప్ అండ్ స్టైల్ అదిరింది

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ శేఖర్‌. ఈ చిత్రానికి జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈరోజు శేఖ‌ర్ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఓ రిపోర్టర్‌ చదివిన నేర వార్తతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా అని కథానాయకుడి రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్ గురించి సాగిన సంభాషణ ఆక‌ట్టుకుంది. రాజశేఖర్ తెల్ల‌టి గ‌డ్డంతో పవర్‌ఫుల్‌ లుక్ అలాగే స్టైల్ అదిరింది అనేలా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న రాజ‌శేఖ‌ర్ కి ఈ శేఖ‌ర్ విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Post Comment