పూనమ్ పాండేను నిండా ముంచేసిన రాజ్ కుంద్రా
Bollywood Movies Trending News

పూనమ్ పాండేను నిండా ముంచేసిన రాజ్ కుంద్రా

శిల్పా శెట్టి భర్త బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా చేస్తున్న వ్యాపారాల్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రాజ్ కుంద్రాకు బిజినెస్ మైండ్ తో పాటు మంచి క్రిమినల్ మైండ్ కూడా ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. హాట్ మోడల్స్ నే బురిడీ కొట్టించి, వారి ఆదాయాన్ని కాజేసిన ఘనుడిగా రాజ్ కుంద్రాపై విమర్శలు వస్తున్నాయి. ఇలా రాజ్ కుంద్రా వల్ల మోసపోయిన వారిలో వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే ఒకరు. రాజ్ కుంద్రా పోర్న్ వీడియో మేకింగ్ కేసులో అరెస్టయిన వెంటనే అందరి దృష్టి పూనమ్ పాండే మీదకు మళ్లింది. ఎందుకంటే రాజ్ కుంద్రా అసలు స్వరూపాన్ని మొదట్లో బయటపెట్టింది పూనమ్ పాండేనే. 2019 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రా మీద ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది పూనమ్ పాండే. రాజ్ కుంద్రా వల్ల ఆమె లక్ష రూపాయలు నష్టపోయింది కూడా.

2019 లో ఆర్మ్మ్ ప్రైమ్ మీడియా అనే యాప్ తయారీ కంపెనీలో రాజ్ కుంద్రా షేర్స్ కొన్నాడు. ఈ కంపెనీ భాగస్వామిగా ఆయన మోడల్ పూనమ్ పాండేను అప్రోచ్ అయ్యాడు. పూనమ్ పేరు మీదే ఒక యాప్ క్రియేట్ చేస్తామని, అందులో ఆమెకు కొంత వాటా ఉంటుందని చెప్పాడు. ఈ ఒప్పందం మేరకు పూనమ్ పాండే ఫొటోస్, వీడియోస్ ఇస్తుంది, వాటిని రాజ్ కుంద్రా కంపెనీ ప్రమోట్ చేసి ఆదాయం పొందుతుంది. ఇలా వచ్చిన రెవెన్యూ లో పూనమ్ కు ఇంత పర్సెంట్ వాటా అని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పర్సెంట్ విలువ దాదాపు 60 లక్షల రూపాయలు. ఈ యాప్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆదాయం పెరిగింది. ఈ రెవెన్యూ గమనించిన పూనమ్ పాండే, అందులో వాళ్లు తనకు ఇస్తానన్న మేర వాటా ఇవ్వడం లేదని తెలుసుకుంది. దీంతో యాప్ తో అగ్రిమెంట్ రద్దు చేసుకుంది.

అయినా రాజ్ కుంద్రా టీమ్ యాప్ లో ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేయడం మానలేదు. ఈ యాప్ లో పూనమ్ పాండే ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల వేలాది కాల్స్ ఆమెకు వచ్చేవట. కొన్నాళ్లు దేశం విడిచి వెళ్లిపోయింది పూనమ్. మూన్నెళ్ల తర్వాత ఇండియా వచ్చినా మళ్లీ అవే కాల్స్, వాటితో వేధింపులు ఎదుర్కొందట. కొత్త ఫోన్ నెంబర్ తో ఈ విషయాన్ని రాజ్ కుంద్రా టీమ్ మెంబర్ కు చెబితే ఆ ఫోన్ నెంబర్ కూడా యాప్ లో పెట్టేశారట. ఈ వ్యవహారంతో విసిగిపోయిన పూనమ్ పాండే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టంతో పాటు మహిళా రక్షణ చట్టాల మీద రాజ్ కుంద్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇలా రాజ్ కుంద్రా వల్ల 60 లక్షల రూపాయలే కాదు మూడు నెలలు దేశం విడిచి వెల్లి తన కెరీర్ పోగొట్టుకుంది పూనమ్ పాండే. తాజా అరెస్ట్ పై ఆమె స్పందిస్తూ..పాత కేసు విషయాలు చెప్పింది. అయితే ఆ కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఎక్కువగా స్పందించడం లేదంది. తన ఆలోచనలు శిల్పా శెట్టి, ఆమె పిల్లల మీద ఉన్నాయని చెప్పింది పూనమ్ పాండే.

Post Comment