Latest Movies

రాజమౌళికీ తప్పని ప్రమోషనల్ పాట్లు..?

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే లిస్ట్ లో ఇప్పుడు సినిమా తీసి చూడు అని కూడా అంటున్నారు. ఆ స్థాయిలో ఉంటున్నాయి సినిమా కష్టాలు. చిన్న సినిమాలకే కాదు.. రాజమౌళి వంటి బిగ్ స్టార్ కు సైతం తప్పడం లేదు సమస్యలు. ప్రధానంగా ప్రమోషన్స్ విషయంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న రాజమౌళి కూడా ఈ సారి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అత్యంత భారీ ఖర్చుతో ఓ ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నాడట. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఉన్నా కూడా రాజమౌళి ఈ ప్రయత్నం చేస్తున్నాడంటే ఖచ్చితంగా కొందరికి కంటెంట్ పై డౌట్స్ కూడా మొదలవుతాయి. అయితే రాజమౌళికి ఇలాంటి డౌట్స్ మామూలే. కాకపోతే సినిమాపై మరింత హైప్ పెంచేందుకే ఈ ప్రమోషనల్ సాంగ్ పాట్లు అంటున్నారు.

Post Comment