ఒన్ అండ్ ఓన్లీ రేర్ స్టార్ విక్టరీ వెంకటేష్

ఏ ఫీల్డ్ లోనైనా విజయమే చివరి స్టెప్. ఆ స్టెప్ ను తన పేరు ముందు చేర్చుకుని మూడు దశాబ్ధాలుగా విజయవంతమైన ప్రయాణం చేస్తోన్న హీరో విక్టరీ వెంకటేష్. అసలు విక్టరీని ఇంటి పేరుగా పెట్టుకోవడం అంటేనే సాహసం. ఆ సాహసాన్ని తనదైన శైలిలో ప్రదర్శిస్తూ.. అవార్డులు, రివార్డులతో పాటు రికార్డులూ అందుకున్న ఏకైక హీరో వెంకటేష్. వారసుడుగా వచ్చినా.. ప్రతిభతో వెలిగిన ప్రభ వెంకటేష్ ది. ఇవాళ విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెంకీ బర్త్ డే విషెస్ చెబుతూ ఇవాల్టి ఫేవరెట్ ఫైవ్ స్టార్ట్ చేద్దాం…
విక్టరీ వెంకటేష్ .. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది.  తరాలు మారుతూ వస్తోన్న తెలుగు సినిమా జగత్తులో… ఈ తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ  నలుగురు హీరోల తరం కొంచెం ప్రత్యేకం. ఆ నలుగురిలో వెంకటేష్ మరీ ప్రత్యేకం. నలుగురులో ఒకడిగా ఉన్నా.. ఆ నలుగురి ఇమేజ్ నూ సంపాదించిన.. ఏకైక హీరో వెంకటేష్ మాత్రమే. బొబ్బిలిరాజాలా మాస్ ఆడియన్సెస్ ను, చంటిలా క్లాస్ ఆడియన్సెస్ ను ఒకేసారి మెప్పించగల సత్తా వెంకీది.
వారసులు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇస్తోన్న రోజులవి. ఆ టైమ్ లో దగ్గుబాటి రామానాయుడు ఓ హీరోతో ఓ సినిమా చేయాలనుకున్నారు. కుదర్లేదు. దీంతో ఎలాగూ చిన్నోడిని హీరోను చేద్దామనుకున్నాం కదా.. అది ఈ కథతోనే ఎందుకు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు. నటుడు కావడం పెద్దగా ఇష్టం లేకపోయినా నాన్న మాట కాదనలేక ఒప్పేసుకున్నాడు వెంకటేష్. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో సొంత బ్యానర్ లో.. 1986 ఆగస్ట్ 14న విడుదలై సంచలన విజయం సాధించిన కలియుగ పాండవులుతో వెంకీ నట ప్రస్థానం మొదలైంది.
తొలి సినిమాతోనే బ