సానియా మీర్జా పై ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు

యావ‌త్ భార‌తావ‌నిని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేస్తూ త‌మిళ‌నాడులో ఘోర దుర్ఘ‌ట‌న చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 14 మంది ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ నీల‌గ‌రి జిల్లా క‌న్నూర్ స‌మీపంలో కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది మ‌ర‌ణించారు. ఈ దుర్ఘ‌ట‌న‌తో దేశం ఒక్క‌సారిగా షాక్ అయ్యింది. రాజకీయ, సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అత్యవ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అలాగే త‌న‌ని ఈ ప్ర‌మాదం తీవ్ర విషాదంలో ముంచింద‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఇలా అంద‌రూ తీవ్ర విషాదంలో ఉంటే.. సానియా మీర్జా మాత్రం డ్యాన్స్ చేసిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజ‌న్లు మండింది. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగి 13 మంది చ‌నిపోయారు. అది కూడా నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా భ‌ర‌త‌మాత సేవ‌లో త‌రించిన‌ మేరున‌గ శిఖ‌రం బిపిన్ రావ‌త్ చ‌నిపోయి విషాదంలో ఉంటే ఇలా డ్యాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు.

సానియా మీర్జా గ‌తంలో కూడా త‌ను చేసిన ఓ ప‌ని వ‌ల‌న‌ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఏంటంటే.. టీ20 ప్రపంచ కప్2021లో పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసేందుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వెళ్లడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సానియా మీర్జా పౌరసత్వం రద్దు చేయాలని, ఆమె పై ఉపా చట్టం పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దేశం పై ఏమాత్రం గౌర‌వం లేదు అన్న‌ట్టుగా ప్ర‌వ‌రిస్తుంది సానియా మీర్జా. ఇక‌నైనా తీరు మార్చుకుంటుందో.. లేక ప్ర‌భుత్వం సానియా పై చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Related Posts