Latest Movies Tollywood

‘నారప్ప’ థియేటర్లో రిలీజ్‌ అయితే… దగ్గుబాటి ఫ్యామిలీ పరువు పోయేదా..?

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని థియేటర్లో చూడాలని వెంకీ అభిమానులు చాలా ఆశపడ్డారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్.. థియేటర్లు మూతపడడం.. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే అనుమానంతో నారప్ప సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అయితే.. ఓటీటీలో నారప్ప చూసిన జనాలకు అసలు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యుంటే ఏమై ఉండేది అనే ఆలోచన వచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. అయితే.. అమెజాన్ లో రిలీజ్ అయిన నారప్పకు పాజిటివ్ టాక్ వచ్చింది. వెంకీ నటన అదిరింది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరి కొంత మంది వెంకీ కెరీర్ లో నిలిచిపోయే సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకటేష్ గతంలో ఎన్నో రీమేక్ లలో నటించారు. అయితే.. ఈ సినిమాలో ఇమేజ్ పక్కన పెట్టి మరీ నటించాడు. అయితే.. వెంకీ నటన పరంగా నారప్ప అద్భుతం అంటున్నారు కానీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో మాత్రం నారప్పా.. నిరాశ తప్పలేదు అప్పా.. అంటున్నారు.

తెలుగు సినిమా సక్సస్ అవ్వాలంటే.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి కానీ.. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. అందుచేత ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేసుంటే.. ఖచ్చితంగా ప్లాప్ అయ్యేది. ఇంకా చెప్పాలంటే.. దగ్గుబాటి ఫ్యామిలీ పరువు పోయేది అనే కామెంట్లు వస్తున్నాయి. ఇలా జరుగుతుందని ముందుగా గ్రహించ బట్టే సురేష్ బాబు తెలివిగా నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. అదీ.. సంగతి.

Post Comment