నా పేరు శివ 2 అంటూ వస్తోన్న సినిమా అసలు కథేంటీ..

తమిళ్ స్టార్ హీరో కార్తీకి కెరీర్ ఆరంభంలో మంచి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో నా పేరు శివ ఒకటి. లవ్, ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ కార్తీతో కాజల్ హీరోయిన్ గా నటించింది. 2010లో సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీపై రివ్యూస్ కూడా అద్భుతంగా వచ్చాయి. నాన్ మహాన్ అల్లా అనే పేరుతో తమిళ్ లో, నా పేరు శివ అనే పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడా మంచి విజయమే సాధించింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ నా పేరు శివ2 అంటూ ఈ సంక్రాంతికి రిలీజ్ అంటూ కొత్త పోస్టర్స్ పడుతున్నాయి. అయితే సినిమా దర్శకుడుగా పా రంజిత్ పేరు పడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలైందీ.. ఇంత సడెన్ గా విడుదల అంటున్నారేంటీ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు కథ వేరే ఉంది. ఇది నా పేరు శివ2 చిత్రం కాదు. ఇంకా చెబితే ఆ చిత్రానికి సంబంధమే లేదు.
ఈ సినిమాకు దర్శకుడు పా రంజిత్. అయితే ఇది ఇప్పుడు రూపొందిన సినిమా కాదు. 2014లో కార్తీ హీరోగా పా రంజిత్ రెండో సినిమాగా వచ్చిన మద్రాస్ అనే తమిళ్ సినిమాకు తెలుగు అనువాదం. అంటే మద్రాస్ చిత్రాన్ని తెలుగులో నా పేరుశివ2 పేరుతో విడుదల చేస్తున్నారన్నమాట. విశేషం ఏంటంటే.. ఈ మద్రాస్ సినిమా చూసిన తర్వాతే రజినీకాంత్ పా రంజిత్ కు కబాలి అవకాశం ఇచ్చాడు.

Karthi's 'Naa Peru Siva 2' racing for release
మద్రాస్ కూడా అద్భుత విజయం సాధించిన చిత్రమే.ఈ సినిమా వచ్చే టైమ్ కు కార్తీ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అప్పుడే అట్టకత్తి అనే చిత్రంతో ఆకట్టుకున్న పా రంజిత్ కు ఛ