సోషల్ మెసేజ్ తో రూపొందిన సినిమా ‘మహిషాసురుడు’

గుండె మార్పిడి మొదలుకుని అనేక జబ్బులను నయం చేయడం కోసం ఉపయోగించాల్సి వైద్య పరికరాల విషయంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ప్రాణాలను కాపాడే కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు వాటిని మన దేశంలోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందివచ్చను అనే పాయింట్ తో తెరకెక్కిన సినిమా మహిషాసురుడు.

మన దేశంలో పరిశోధనలు చేసే సైంటిస్ట్ లకు తగినంత గుర్తింపు లేకపోవడం వల్లే వైద్య పరికరాల విషయంలో మనం ఇంకా విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఈ వాస్తవ అంశాలను సమాజానికి, ప్రభుత్వాలకు తెలియజేయాలనే సంకల్పంతోనే డాక్టర్ ఎస్ గురుప్రసాద్ నిర్మిస్తూ నటించిన సినిమా ఇది.

అలాగే ఫైనాన్స్ కంపెనీల ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకొని, వాళ్ల ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేక ఎన్నో కుంటుబాలు ఆత్మహత్యలు చేసుకొంటున్నాయి అనే మరో అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించారు. సమాజానికి మేలు చేయాలి, తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోగలిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలవుతుందన్న ఆయన తపనే ఈ చిత్ర నిర్మానికి మూలం. కుటుంబ అనుబంధాలను సమ్మిళతం చేసి నిర్మించారీ చిత్రాన్ని. మెసేజ్ తో పాటు వినోదాత్మక అంశాలు కూడా ఉన్నాయని మూవీ టీమ్ చెబుతోంది.


నిర్మాత డాక్టర్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో వినోద్, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. త్వరలోనే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోందీ చిత్రం.

Related Posts