మాటిచ్చావ్ కొరటాల..తేడా వస్తే దాని ఖరీదు ఎన్టీఆర్ కెరీర్..

ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అని ఫ్యాన్స్ తో ఇండస్ట్రీ కూడా ఎదురుచూసింది. ముందే అనుకున్న త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ కావడంతో సడెన్ గా సీన్ లోకి కొరటాల శివ వచ్చాడు. కొరటాల అప్పటికే ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో నిలిచే ఆచార్య ఇచ్చి ఉన్నాడు. దీంతో చాలామంది ఎన్టీఆర్ ది రాంగ్ డెసిషన్ అన్నారు. బట్ అతను పట్టించుకోలేదు. ఇలా అన్నవాళ్లందరికీ గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నాడేమో.. కొరటాల కూడా కథ విషయంలో చాలా అంటే చాలానే టైమ్ తీసుకున్నాడు. ఈ విషయంలోనూ చాలా కామెంట్స్ తో పాటు ట్రోల్స్ కూడా వచ్చాయి. అవేవీ టీమ్ పట్టించుకోలేదు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ విడుదలైన యేడాది తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా పట్టాలెక్కింది.


మామూలుగా రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో తర్వాత మూవీతో డిజాస్టర్ చూస్తాడు అనే సెంటిమెంట్ ఉంది. అది నిజం కూడా. రామ్ చరణ్ కూడా ఆచార్యలో ఉన్నాడు కదా..? ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ అదే చూస్తున్నారు చాలామంది. బట్ ఓ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తే ఎన్టీఆర్ హిట్ కొడతాడు. అందుకు ఉదాహరణ.. అరవింద సమేత. ఈ చిత్రానికి ముందు త్రివిక్రమ్ కూడా అజ్ఞతవాసితో ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చాడు. అప్పుడూ ఎన్టీఆర్ ను చాలామంది వారించారు. వినలేదు. భారీ విజయం అని చెప్పలేం కానీ.. అరవింద సమేతతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల విషయంలోనూ అదే రిపీట్ అవుతుందనీ అతను.. అవ్వాలని అభిమానులూ అనుకుంటున్నారు.


ఇక లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ ను భారీగా నిర్వహించారు. టాప్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. ఈ వేదిక నుంచి కొరటాల శివ చాలా పెద్ద ప్రామిస్ చేశాడు. ఇండియాలోని చాలామంది వదిలేసిన ఓ కోస్టల్ కారిడార్ నేపథ్యంలో కథ సాగుతుందనీ.. అక్కడ మృగాల్లాంటి మనుషులు ఉంటారని.. వారందరినీ అదుపు చేసేందుకు ఒక భయం వస్తుందనీ.. ఆ భయం ఏంటో మీ అందరికీ తెలుసు అన్నాడు. అంటే ఎన్టీఆర్ అన్నమాట. ఇదే వేదికపై నుంచి ఇంతకు ముందెప్పుడూ చూడని ఎన్టీఆర్ ను చూస్తారు అంటూ అభిమానులకూ అభయం ఇచ్చే ప్రయత్నం చేశాడు.


అయితే కొరటాల గత సినిమా ఆచార్య అనుభవం నుంచి అభిమానులు ఇంకా తేరుకోలేదు. అందుకే అతను అంత కాన్ఫిడెంట్ గా చెప్పినా పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు కొరటాల ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ అతను ఖచ్చితంగా నెగ్గాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఆర్ఆర్ఆర్ తో ఫామ్ అయిన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను పూర్తిగా కోల్పోతాడు. పైగా ఇది తనకు ఫస్ట్ సోలో ప్యాన్ ఇండియన్ సినిమా. దీంతో కొరటాల మాటల్లోనే కాదు.. కథ, కథనాల్లోనూ ఆ నమ్మకం కనిపించాలి. అప్పుడే ఎన్టీఆర్ అభిమానులు శాటిస్ఫై అవుతారు. లేదా.. ఏ మాత్రం తేడా వచ్చినా.. మొత్తానికే మోసం వస్తుంది. అటు కొరటాల ఇమేజ్ పోతుంది. ఇటు ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడుతుంది. సో.. ఇప్పుడు ప్రెజర్ అంతా కొరటాల శివపైనే ఉంది. దాన్ని తట్టుకుని, దాటి తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిందే.

Related Posts