మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో క్రేజీ మూవీ

ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. బట్ ఆ టేస్ట్ ను పట్టుకోగలిగితే ఏ తరం దర్శకుడైనా ఎంటర్టైన్ చేస్తాడు అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకకప్పుడు లెజెండరీ డైరెక్టర్ గా కంట్రీ మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు మణిరత్నం. ప్రతి సినిమా ఓ క్లాసిక్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే అద్భుతమైన ప్యాన్ ఇండియన్ మూవీస్ ను అందించాడు. అందుకే మణిరత్నం సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే నే సినిమాకు వెళ్లే సెటిల్డ్ ఆడియన్స్ అన్ని భాషల్లోనూ ఉన్నారు.

ఇంక అచ్చంగా అలాంటిదే.. ఇంకా చెబితే అంతకంటే ఎక్కువ ఇమేజే ఉన్న నటుడు కమల్ హాసన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 90ల్లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తరం ప్రేక్షకులు కూడా ఆ చిత్రానికి అతుక్కుపోయి చూస్తారు.

ఇండియన్ గాడ్ ఫాదర్ వెర్షన్ కు అచ్చమైన ఉదాహరణ ఈ మూవీ. ఎంతోపెద్ద ఇమేజ్ తెచ్చుకున్న ఈ పెద్ద స్టార్స్ తర్వాత మళ్లీ కలిసి పనిచేయకపోవడం విశేషం. రీసెంట్ గా విక్రమ్ తో కమల్ హాసన్.. పొన్నియన్ సెల్వన్ తో మణిరత్నం మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నిజానికి పొన్నియన్ సెల్వన్ ను కూడా ఒకప్పుడు కమల్ తో చేయాలనుకున్నాడు మణిరత్నం.

అప్పట్లో బడ్జెట్ ఇష్యూస్ వల్ల కుదరలేదు. ఇప్పుడు కమల్ ఏజ్ సరిపోదు కాబట్టి సెట్ కాలేదు. అయితేనేం.. మేమిద్దరం కలిసి మరో సినిమా చేస్తున్నాం అని గతంలోనే ప్రకటించారు. అది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది.

ఇక పొన్నియన్ సెల్వన్ 2 కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి.. మణిరత్నం కాస్త ఫ్రీ అవుతాడు. సో ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. నిన్నటి వరకూ ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. బట్ ఫైనల్ గా వీరితో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విద్యా బాలన్ ను ఫైనల్ చేశారు.


కమల్ హాసన్, విద్యా బాలన్ కాంబినేషన్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. 40 పదుల వయసులో ఉన్న విద్యా బాలన్ ఇప్పటికీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు.. గ్లామర్ రోల్స్ నూ చేయడానికి సిద్ధంగానే ఉంది. సో కమల్ తో ఆమె కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. విద్యా బాలన్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మరి తను కమల్ సరసన నటిస్తుందా.. లేక సినిమాలో ఇంకేదైనా పాత్ర చేస్తుందా అనేది చూడాలి.


ఇక విశేషం ఏంటంటే.. ప్రయోగాలకు ముందుండే కమల్ తో మణిరత్నం ఈ సారి ఎక్స్ పర్మెంట్ నే చేస్తున్నాడట. అంటే ఈ మూవీలో చనిపోయిన ఓ వ్యక్తి తిరిగి మళ్లీ బ్రతికి వస్తే.. అతను కొందరికి మాత్రమే కనిపిస్తే.. ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ కథ సాగుతుందని టాక్. మరి ఈ టాక్ ఎంత వరకూ నిజమో కానీ.. కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందంటున్నారు జనం.

Related Posts