పాపం బాలీవుడ్..హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లేవ్

బాలీవుడ్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లాస్ట్ వీక్ నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న రాజ్ కుమార్ రావు నటించిన భీడ్ అనే సినిమా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ డే కేవలం 15లక్షలు మాత్రమే వసూలు చేసి బాలీవుడ్ బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది.

రాజ్ కుమార్ సినిమాలంటే బలమైన కంటెంట్ ఉంటాయి. పైగా ఆ దర్శకుడు కూడా అంతకు ముందు ఆర్టికల్ 15 వంటి అనేక ఆలోచనాత్మక సినిమాలు తీసి కమర్షియల్ గానూ విజయం సాధించాడు. అలాంటి భీడ్ ట్రేడ్ కు భీబత్సమైన షాక్ ఇచ్చింది. ఇక ఈ వారం వచ్చిన అజయ్ దేవ్ గణ్ భోళా అయినా బాలీవుడ్ ను కాపాడుతుంది అనుకుంటే అజయ్ మూవీ కూడా షాకే ఇచ్చింది.


తమిళ్ లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీని హిందీలో భోళాగా రీమేక్ చేశాడు అజయ్ దేవ్ గణ్. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనే. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అతను చాలా మార్పులు చేసినట్టు కనిపించింది.

యాక్షన్ డోస్ పెంచాడు. హీరోయిన్ తో రొమాన్స్ లూ, డ్యూయొట్స్ కూడా యాడ్ చేశాడు. పైగా ఖైదీలో కార్తీతో పాటు పోలీస్ ఆఫీసర్ గా నటించిన నరేన్ నటించిన పాత్రలో టబును తీసుకుని పెద్ద మార్పే చేశాడు. ట్రైలర్ చూస్తే ప్రస్తుత మాస్ ట్రెండ్ కు తగ్గట్టుగానే కనిపించింది.

దీంతో ఈ మూవీ బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఇస్తుందని అంచనా వేశారు విశ్లేషకులు. బట్.. వారి అంచనాలు తప్పాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన భోళా మొదటి రోజు కేవలం 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ట్రేడ్ కు మరో షాక్ ఇచ్చింది. నిజానికి ఖైదీ ఒకే నైట్ లో జరిగే కథ. బట్ భోళా ట్రైలర్ చూస్తే అలా అనిపించలేదు. ఇంకా చెబితే.. ఈ సింగిల్ నైట్ స్టోరీ మూవీని బాలీవుడ్ లోనూ ఓటిటిల్లో చాలామంది చూసి ఉన్నారు. భోళాకు భారీ ఓపెనింగ్స్ రాకపోవడానికి అదీ ఓ కారణం అనుకోవచ్చు.


ఆశ్చర్యం ఏంటంటే.. ఈచిత్రానికి క్రిటిక్స్ అందరూ మంచి రివ్యూసే ఇచ్చారు.మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అనేశారు. అయినా ఫస్ట్ డే పెద్దగా టికెట్స్ తెగలేదు. అయితే రివ్యూస్ తో పాటు పబ్లిక్ టాక్ వల్ల ఈ వీకెండ్ కు పుంజుకుంటుందీ అనుకుంటున్నారు. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. కాకపోతే బాలీవుడ్ లో పఠాన్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కు ఆ ఊపు తెచ్చే సినిమా కనిపించడం లేదు.

Related Posts