ఇస్మార్ట్ బ్యూటీ నిధి కోటిన్నర డిమాండ్ చేస్తోందా..?
Movies Tollywood Trending News

ఇస్మార్ట్ బ్యూటీ నిధి కోటిన్నర డిమాండ్ చేస్తోందా..?

నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా రోజులైంది. కానీ టాప్ హిట్ అనేది రావడానికి చాలా టైమ్ పట్టింది. తాను నటించిన సినిమాల్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. అంతకు ముందు చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే ఆమె గ్లామర్ మాత్రం యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి కాస్త ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ పడ్డాక ఈ బ్యూటీకి కాస్త ఆఫర్లు పెరిగాయి. దీంతో ఈ హాట్ బ్యూటీ రెమ్యూనరేషన్ పెంచిందంటున్నారు.

నిధి అగర్వాల్ తెలుగు సినిమాల్లో చేయడానికి కోటిన్నర పారితోషకం అడుగుతోందట. తెలుగులో ఈ బ్యూటీ కృష్ణ మనవడు అశోక్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తోంది. మరికొన్ని డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. పవన్ సినిమా సక్సెస్ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం. కానీ అంతకుముందే రెమ్యునరేషన్ తో నిర్మాతలను కంగారు పెడుతోంది. అయితే తమిళంలో మాత్రం రెమ్యునరేషన్ డిమాండ్స్ ఎక్కువగా లేవంటున్నారు. మరి కోటిన్నర రెమ్యునరేషన్ తో ఈ బ్యూటికి ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి.

Post Comment