Latest Movies

తమన్ కూడా ఊహించి ఉండడేమో ఇది..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్, ఆచార్య చిత్రాల తర్వాత శంకర్ డైరెక్షన్లో మూవీకి రెడీ అవుతున్నాడు. శంకర్ సినమా అంటే నేషనల్ వైడ్ గా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. భారీ బడ్జెట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ ని, సోషల్ మెస్సేజ్ ని మిక్స్ చేసి శంకర్ తన సినిమాలతో మెప్పిస్తుంటాడు. అయితే ఇప్పటి వరకు తమిళ హీరోలంతోనే సినిమాలు తీసిన శంకర్, ఫస్ట్ టైమ్ తెలుగు హీరో రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. పైగా ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది.
శంకర్, రామ్ చరణ్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన టెక్నీషియన్స్ ని ఒక్కొక్కర్నీ అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని తీసుకున్నట్లు ప్రకటించారు. తమన్ కి ఇది బంపర్ ఆఫరే. గతంలో రామ్ చరణ్ నటించిన నాయక్, బ్రూస్ లీ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చాడు తమన్. పైగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆ కారణంగానే శంకర్, తమన్ ని తీసుకున్నాడు. ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని, డైలాగ్ రైటర్ గా సాయిమాధవ్ బుర్రాని తీసుకున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. హీరోయిన్ అనౌన్స్ మెంట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా శంకర్, చరణ్ ల సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.

 

Post Comment