“పుష్ప” ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ప్ర‌భాస్ వస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం పుష్ప‌. ఈ భారీ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ‌న్నీ, సుక్కు క‌లిసి చేస్తున్న ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను పుష్ప సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో ప్ర‌మోష‌న్ లో స్పీడు పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్లాన్ క్యాన్సిల్ చేశారు. హైద‌రాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వేడుక‌కు ఇంకా డేట్ క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. అయితే.. గ‌త రెండు, మూడు రోజుల నుంచి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గెస్ట్ గా రానున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌భాస్ నిజంగా పుష్ప ఫంక్ష‌న్ కి వ‌స్తున్నాడా..? లేక పుకారేనే అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ.. ప్ర‌చారంలో ఉన్న వార్తలో వాస్త‌వ‌మేంత అని ఆరా తీస్తే.. అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్ర‌భాస్ రావ‌డం లేద‌ట‌.

కార‌ణం ఏంటంటే.. ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ రెండో వారం నుంచి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు. నార్త్ లో ప్ర‌భాస్ తో భారీగా ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేశార‌ట‌. అందుచేత ప్ర‌భాస్ పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి రాలేన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో బ‌న్నీ పుష్ప ఈవెంట్ కు గెస్ట్ ఎవ‌రైతే బాగుంటారా.. అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట పుష్ప మేక‌ర్స్. మ‌రి.. పుష్ప ఫంక్ష‌న్ కి గెస్ట్ గా ఎవ‌రు వ‌స్తారో చూడాలి.

Related Posts