డాన్సర్ చైతన్య మరణం లో మల్లెమాల పాత్ర ఉందా ..?

డాన్స్ .. కొందరికి ఇదంటే పిచ్చి. అందుకే ఆట కోసం ఏమైనా చేస్తారు. ఈ క్రమంలో ప్రాణాలు పెట్టేది కొందరైతే .. అందుకోసం ప్రాణాలే తీసుకునేది మరికొందరు. ప్రతిభ ఉన్నవాళ్ళంతా అందలం ఎక్కుతారు అనుకోలేం. కానీ అందుకోసం వేచి చూడటం అనేది ప్రతిఒక్కరూ చేయాలి. ప్రస్తుతం డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య విషయం చూస్తే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. అవకాశాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. కానీ మన ప్రయాణమే ఆగిపోయేంత ఆరాటం ఉండకూడదు.


ఇక చైతన్య ఆత్మహత్యకు అప్పులే ప్రధాన కారణం అని అతని సూసైడ్ వీడియో లోనే ఉంది. మరి ఇంత పెద్ద డాన్స్ షో లో కొరియోగ్రాఫర్ గా ఉన్న వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులేంటి అని ఎవరికైన అనిపిస్తుంది. ఈ విషయంలో చైతన్య తప్పు చేశాడా అనుకునేవారూ ఉన్నారు. బట్ నిజాలు వేరు కదా.. ఢీ షో లో ఒక పాట ప్రదర్శనకు ఇచ్చే మొత్తం ౩౦ – 45 వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఆ పాటకు రిహార్సల్ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది.

అన్ని రోజుల పాటు డాన్సర్స్ కు అయ్యే ఖర్చు, వారికి అలవెన్స్, డాన్స్ హాల్ ఇవన్నీ కూడా ఆ మొత్తం లోనే చెల్లించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత చిన్న అమౌంట్ తో అంతమందిని అన్ని రోజులు మైంటైన్ చేయడం కష్టం కాదు.. దాదాపు అసాధ్యం. ఇదుగో .. ఇక్కడే డాన్స్ మాస్టర్ చైతన్య రాంగ్ స్టెప్ వేసాడు. వస్తోన్న ఫేమ్ ను బట్టి హార్డ్ వర్క్ పెంచాడు. అంటే దానర్థం సొంతంగా ఫైనాన్స్ చేసుకున్నాడు. అందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది.

మరోవైపు తాను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ కు సంబందించిన ప్రెమెంట్స్ కూడా ఇన్ టైం లో క్లియర్ కాలేదట. దీంతో ఆ డబ్బులు వస్తే ఈ అప్పులు తీర్చుకోవచ్చు అనుకున్న అతని ఐడియా వర్క్ అవుట్ కాలేదు. దీనికి తోడు అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి పెరిగింది. చివరగా నెల్లూరు లో ఒక ఈవెంట్ కు వెళ్ళాడు. అక్కడ ఉండగానే అప్పుల వాళ్ళ నుంచి కాల్స్ రావడం తో ఒక ఎమోషనల్ మూమెంట్ లో ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది అందరూ ప్రాథమికంగా చెబుతోన్న మాట.


అయితే చైతన్య వీడియో లో ఒక మాట స్పష్టంగా ఉంది. జబర్దస్త్ లో చేసే వారికి మాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది అన్నాడు. అంటే జబర్దస్త్, ఢీ రెండిటినీ మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ ఉద్దేశ్యం లో చైతన్య ఈ మాట అని ఉంటాడు. అయితే ఏ షో కి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ప్రొడ్యూసర్స్ ముందే డిసైడ్ చేసుకుంటారు. జబర్దస్త్ లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండరు.

ప్రాక్ట్స్ టైం తక్కువే. పైగా చాలామందికి జబర్దస్త్ టీమ్ లీడర్స్ డబ్బులే ఇవ్వరు. ఇంకా చెబితే అవకాశం కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన వారూ ఉన్నారు. బట్ డాన్సర్స్ కు అలా కాదు కదా.. ? అందుకే వీళ్లకు ఇచ్చే పారితోషికం పెంచడమో లేక డాన్సర్స్ ఖర్చులు ప్రొడ్యూటీన్ హౌస్ భరించడమో చేసి ఉంటె ఈ సమస్య వచ్చేది కాదు అంటారు. అందుకే చైతన్య ఈ విషయాన్నీ అంత ఖచ్చితంగా చెప్పాడు అంటూ డాన్సర్స్ భోరుమని ఏడుస్తున్నారు.

ఏదేమైనా తన స్టెప్పులతో అతి తక్కువ టైం లోనే ఎంతోమంది మన్ననలు పొందిన చైతన్య చివరికి ఇలా ప్రాణమే తీసుకునేంత రాంగ్ స్టెప్ వేయడం మాత్రం మంచి నిర్ణయం కాదేమో. జీవితం నేర్పే పాఠాలు ఇలానే ఉంటాయి. వాటికి మనదైన శైలిలో మంచి అడుగులు వేయడం నేర్చుకోవాలి తప్ప .. తప్పటడుగులు వేస్తే.. చివరికి కన్నవారికి కడుపు తీపి.. అయినా వారికి కన్నీళ్లే మిగులుతాయి. మరి చైతన్య కామెంట్స్ పై మల్లెమాల ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Posts