HomeMoviesహాలీవుడ్పారితోషికం భారీగా పెంచేసిన విశ్వక్ సేన్

పారితోషికం భారీగా పెంచేసిన విశ్వక్ సేన్

-

కథానాయకులకు మాస్ ఇమేజ్ అనేది వరం. అది సంపాదించుకుంటే చాలు తమకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని పొందొచ్చు. ఈ విషయంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ను ప్రత్యేకంగా అభినందించాలి. హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కొన్నాళ్లకే తనకంటూ ఓ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా సాగుతూ.. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో అగ్ర పథాన దూసుకెళ్తున్నాడు విశ్వక్ సేన్. ఈ ఏడాది ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. ‘మెకానిక్ రాఖీ, లైలా’ వంటి మరో రెండు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. ఇటీవలే తన 13వ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో.. 14వ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అనుదీప్ కె.వి. దర్శకత్వంలోనూ ప్రకటించాడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ దర్శకుడు కృష్ణ చైతన్య తోనూ మరో మూవీకి కమిట్ అయ్యాడట.

ఇలా.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూకుడు పెంచిన మాస్ కా దాస్ తన పారితోషికంతోనూ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాడు. వరుస సినిమాలు చేతిలోకి రావడంతో విశ్వక్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోన్న అనుదీప్ కె.వి. సినిమాకోసం విశ్వక్ సేన్ కు రూ.7 కోట్లు ఇవ్వబోతున్నారట. తన తర్వాతి సినిమాల కోసం కూడా ఇదే రెమ్యునరేషన్ ను కోట్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇవీ చదవండి

English News