భారీ బిజినెస్ చేసిన బంగార్రాజు

అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ చిత్రం. 2015లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అప్పట్లో సోగ్గాడే చిత్రం నాగార్జున కెరీర్ లోనే(ఇప్పటికి కూడా) హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ ఫాంటసీ ఫ్యామిలీ డ్రామగా వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు ఇంత హైప్ ఉండటానికి అదీ ఓ కారణం అయితే.. ఇటు చైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో ఉన్నాడు. పైగా అతనికి విడాకులు తర్వాత వస్తోన్న తొలి సినిమా కాబట్టి చే అండ్ నాగ్ కలిసి రెండో సారి చేస్తోన్న సినిమా కూడా కావడంతో అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి బంగార్రాజుకు.
చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నాగ్ కు జోడీగా మళ్లీ రమ్యకృష్ణే నటించింది. అయితే చే పాత్ర చనిపోయిన నాగ్ కు మనవడుగా ఎంట్రీ ఇవ్వబోతోంది. అంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న డాక్టర్ బాబు తనయుడే ఈ చైతన్య అనుకోవచ్చు. సో లావణ్య త్రిపాఠి తనయుడు అనుకోవచ్చు. మరి ఈ లింక్ ను ఎలా కన్వే చేశారో కానీ.. ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఈ చిత్రానికి సీనియర్ రైటర్ సత్యానంద్ తో కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా రాయించారు.
మొత్తంగా భారీ అంచనాలు ఆడియన్సెస్ లోనే కాదు.. బిజినెస్ లోనూ క్రియేట్ చేసిందీ చిత్రం. అందుకే 40కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా చేయగలిగింది. ఓవర్శీస్ లో కాస్త ఒమిక్రాన్ భయం ఉంది. కానీ థియేటర్స్ పూర్తిగా మూసేయలేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి అనుమతులున్నాయి. అందుకే ఈ మొత్తాన్ని రాబట్టడం బంగార్రాజుకు పెద్ద కష్టమేం కాదు. ఇంకా చెబితే.. ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ పెట్టినా.. సినిమా బావుంటే ఈ 40కోట్లు రాబట్టడం ఈ సోగ్గాళ్లకు ఏ ఇబ్బందీ ఉండదు. మొత్తంగా బంగార్రాజు దూకుడు బిజినెస్ లోకూడా బానే ఉందన్నమాట.

Related Posts