Movies Tollywood

కూల్ ఎంటర్‌టైనర్‌గా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది ఎంఎస్ రాజు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. నిర్మాతగానూ ఆయన సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన విషయం విధితమే. ఇప్పుడు మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఈరోజు సినిమా పోస్టర్ విడుదల చేశారు.
‘7 డేస్ 6 నైట్స్’ పోస్టర్ చూస్తుంటే సుమంత్ అశ్విన్ హీరో అని అర్థమవుతుంది. ఆయన పక్కన క్యూట్‌గా ఉన్న హీరోయిన్ మెహర్ చావల్ (తొలి పరిచయం). మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “జూన్ 21న హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ స్టార్ట్ చేశాం. నాన్‌స్టాప్‌గా 22 రోజులు చిత్రీకరణ చేశాం. ఈ నెలాఖరున అవుట్‌డోర్ షెడ్యూల్ కోసం ప్రయాణమవుతాం. జూలై 28 నుంచి 20 రోజుల పాటు కంటిన్యూస్‌గా బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో షూటింగ్ చేస్తాం. చాలా యూత్‌ఫుల్ కంటెంట్‌తో సినిమా నిర్మిస్తున్నాం. పాటలకు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉంది. గిలిగింతలు పెట్టే కథాంశం ఇది. సహజత్వానికి దగ్గరగా ఉండే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. డర్టీ హరి తర్వాత మా నాన్నగారు చేస్తున్న ఈ సినిమా చాలా అద్భుతంగా వస్తోంది” అని అన్నారు.

సహ నిర్మాతలలో ఒకరైన జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ “ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కొంత విరామం తర్వాత మళ్లీ రంగంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థలో ఇంతకు ముందు వచ్చిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఆట’, ‘మస్కా’ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందుతోంది” అని అన్నారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ “సాధారణంగా ‘డర్టీ హరి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, ‘7 డేస్ 6 నైట్స్’ అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉండే చిత్రమిది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి. సినిమాలో పాత్రలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అన్నట్టు కాకుండా మన కళ్ల ముందు కదలాడే సజీవ పాత్రల్లా ఉంటాయి. అందరూ ఆ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ఇంతకు ముందు నా సినిమాల ద్వారా చాలామందికి బ్రేక్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఇందులో నటీనటులకు బ్రేక్ ఇస్తుంది. వీళ్లందరూ స్టార్స్ అవుతారు. మంచి కథ, దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని దర్శకునిగా సినిమా చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటికి 60 శాతం సినిమా పూర్తయింది” అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ,   ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు:  సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

6 Comments

 1. Wonderful items from you, man. I’ve take into account
  your stuff prior to and you’re just extremely
  great. I really like what you have obtained here, certainly like
  what you are stating and the way in which through
  which you assert it. You make it enjoyable and you continue to care for to keep it smart.
  I cant wait to learn much more from you. This is actually a wonderful site.

  Also visit my blog :: buy weed

  Reply
 2. Wonderful article! That is the type of info that are supposed to be shared across the web.

  Disgrace on Google for no longer positioning this post
  upper! Come on over and talk over with my site . Thank you
  =)

  Feel free to surf to my page; penguin cbd

  Reply
 3. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet
  my newest twitter updates. I’ve been looking for
  a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this.
  Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I
  look forward to your new updates.

  Reply

Post Comment