దుమ్మురేపుతున్న దసరా..నాని కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్

ఫస్ట్ నాని ఊరమాస్ గెటప్ తో చేసిన సినిమా దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీకాంత్ కు ఫస్ట్ మూవీ అయినా ది బెస్ట టేకింగ్ తో ఎంటైర్ కోలీవుడ్ ను మెస్మరైజ్ చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో 1990ల నేపథ్యంలో రూపొందిన దసరాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేశారు.

ఊహించని విధంగా అన్ని చోట్లా అదరగొడుతున్నాడు మన ధరణి, వెన్నెల. ఈ చిత్రంలోని పాటకు తగ్గట్టుగానే ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మామూలుగా నాని కమర్షియల్ మార్కెట్ రేంజ్ ఇప్పిటి వరకూ 50 కోట్ల వరకూ మాత్రమే. అలంటి హీరోపై నిర్మాత చెరుకూరి సుధాకర్ ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదట్లో అంతా నిర్మాత లాస్ అవక తప్పదు అనుకున్నారు.

బట్ ఆ ప్రొడ్యూసర్ నమ్మిందే నిజమైంతే. కేవలం నాలుగు రోజుల్లోనే 87కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది దసరా. ఈ ఊపు మరో మూడు నాలుగు రోజుల వరకూ ఉంటుంది. ఖచ్చితంగా చెబితే రవితేజ రావణాసుర వచ్చే వరకూ దసరాకు తిరుగులేదు అని చెప్పాలి.


విశేషం ఏంటంటే .. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియన్స్ ఆడియన్స్ కు పెద్దగా తెలియని నాని.. ఈ దసరా మూవీతో కోలీవుడ్ లో శింబు సినిమా పాథు తలాకు గట్టి పోటీ ఇచ్చాడు. ఇటు హిందీలో అజయ్ దేవ్ గణ్ ఖైదీ రీమేక్ భోళాకూ షాక్ ఇచ్చాడు. అంటే ఆ రెండు చోట్లా స్టార్స్ ఉన్నా.. అక్కడేమాత్రం స్టార్డమ్ లేని నానిదే పై చేయిగా ఉందన్నమాట.

ఇక వెన్నెల, ధరణి పాత్రల్లో కీర్తి సురేష్, నాని పోటాపోటీగా నటించి మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచారు. దర్శకుడు శ్రీకాంత్ టేకింగ్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అన్నీ కలిపి హైలెట్ గా నిలిచాయి. కాస్త డివైడ్ టాక్ వచ్చినా దాటుకుని బాక్సాఫీస్ బరిలో స్ట్రాంగ్ గా నిలిచింది దసరా. ఈ మూవీ చూస్తోంటే సులువుగానే 150 కోట్ల గ్రాస్ కు చేరువయ్యేలా ఉందీ చిత్రం. ఇదే నిజమైతే.. ఇక నాని ఏ మాత్రం మీడియం రేంజ్ హీరో అనిపించుకోడు.

Related Posts